- పుతిన్ “పుష్పా” సినిమా చూసేసాడా ?
- రష్యన్స్ కి మన సినిమాలంటే మోజు !
మాస్కో నుంచి ఆసక్తికరమైన వార్తొచ్చింది. భారతీయ సినిమాలపై ప్రేమను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అద్భుతంగా వ్యక్తపరిచారు. భారత్‌తో దౌత్య సంబంధాలు బలపడుతున్న వేళ, పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగా హైలైట్ అయ్యాయి.
“ఇండియన్ మూవీస్ అంటే మాకు బాగా ఇష్టం!” అన్నాడు పుతిన్.
రష్యాలోని సోచి అనే నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్, భారతీయ సినిమాల పాపులారిటీ గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో చెప్పాలంటే:
“మాకు ఇండియన్ మూవీస్ అంటే నిజంగా ప్రేమ. అందుకే ప్రత్యేకంగా 24 గంటలు ఇండియన్ సినిమాలను ప్రసారం చేసే టీవీ ఛానెల్‌నే నడుపుతున్నాం. భారత్ వెలుపల అలా చేసే దేశం బహుశా మేమే!” అని పుతిన్ తెలిపారు.
- ఇది విని భారతీయ సినిమా ప్రేమికులు గర్వపడాల్సిందే!
- సినిమాలు మాత్రమే కాదు… బంధం బలమైనది
ఇండియా, రష్యా మధ్య ఉన్న బంధం రాజకీయ-వ్యాపార పరిమితుల్లోనే ఉండదని పుతిన్ స్పష్టం చేశారు. “మా దేశంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. భారతీయ సంస్కృతి పట్ల, సినిమాల పట్ల రష్యన్లు చూపే అభిమానానికి మేము ఎంతో విలువ ఇస్తాం” అని అన్నారు.
సోవియట్ యూనియన్ రోజుల నుంచే ఈ బాంధవ్యానికి బేస్.
రష్యాలో ఇండియన్ సినిమాల క్రేజ్ కొత్తది కాదు. పాతతరం రష్యన్లు ఇప్పటికీ రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తిల గురించి మాట్లాడతారు.
1982లో వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్’ సినిమా రష్యాలో ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
‘జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా’ పాట అయితే రష్యాలో అప్పట్లో ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో వినిపించింది.



