శ్రీ సత్య సాయి బాబా శత వర్ష జన్మదినోత్సవాల్లో పాల్గొనండి – ఆర్ లక్ష్మణ రావు

0
69

విశాఖపట్నం జయ జయహే: నవంబర్ నెలలో రాబోయే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా రైల్వే ఏరియా తాటిచెట్లపాలెం భజన మండలి నూతన శ్రీ సత్య సాయి మందిరం ఆనంద నిలయం ను ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్య సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణ రావు ప్రారంభించారు.

వేదం పఠనం, భజనల అనంతరం భక్తుల నుద్దేశించి మాట్లాడుతూ, తన ఆధ్యాత్మిక ప్రసంగం లో ఆర్ లక్ష్మణ రావు దీనుల సేవలో సేవించి తరిస్తున్న తాటిచెట్లపాలెం భజన మండలి శ్రీ సత్య సాయి భక్తులను అభినందించారు. “అందరినీ ప్రేమించు”- అందరినీ సేవించు” అన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య సందేశం తో ప్రేరణ కలిగి లక్షలాది మంది భక్తులు విశ్వవ్యాప్తంగా 150 పైగా దేశాల్లో నిస్వార్ధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

నవంబర్ నెలలో రాబోయే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకల్లో పుట్టపర్తిలో పాల్గొనడానికి దేశ, విదేశాల్నించి విశిష్ట అతిధులు, లక్షలాది మంది భక్తులు పాల్గొనబోతున్నారని, అందరికీ శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మరియు భారత దేశం శ్రీ సత్య సాయి సేవా సంస్థలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత వర్ష జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆర్ లక్ష్మణ రావు ఆహ్వానించారు.
నిస్వార్ధ సేవలో పాల్గొంటున్న శ్రీ సత్య సాయి భక్తులు ప్రతి ఒక్కరూ ధన్యులని ఆర్ లక్ష్మణ రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ యెన్ నాయుడు, శ్రీ సత్య సాయి సేవా సంస్థల పదాధికారులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here