Laws should be in public interest - Satya Prabha
Laws should be in public interest – Satya Prabha

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం 2023 కు వ్యతిరేకం గా ఈరోజు ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్తిపాడు లో నిర్వహిస్తున్న ఈ వంట వార్పు కార్యక్రమం నకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వరుపుల సత్య ప్రభ రాజా హాజరై న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు.. ఈ సందర్బంగా సత్య ప్రభ రాజా మాట్లాడుతూ దేశం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలు చేసుకొనే అధికారం కలిగి ఉంటాయి. అయితే ఆ ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజా ప్రయోజనం ఉండేలా ఉండాలి అన్నారు. అధికారం ఉంది కదా అని రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాధమిక హక్కులను హరించే విధంగా ఏ ప్రభుత్వం చట్టాలు చేయకూడదు. చట్టాలు ప్రజా హితం కోరుకొనేవిగా ఉండాలి.. ప్రజామోదం పొందేవిగా ఉండాలి.ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ కల్పించేవి గా ఉండాలి అన్నారు.అంతే గానీ వారి హక్కులను కాలరాస్తూ, వారి ఆస్తులను దోచుకొనేవిగా ఉండకూడదు.రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూ యాజమాన్య హక్కు చట్టం 2023 అంటూ చట్టం చేసిందో ఆ చట్టం
అమలు లోకి వస్తే భూ వివాదాలు పూర్తిగా రెవిన్యూ చేతిలోకి పోతాయి.రెవెన్యూ వ్యవస్థ రాజకీయాలకు అనుసంధాన మైన వ్యవస్థ.

స్వతంత్ర వ్యవస్థ అయిన న్యాయ వ్యవస్థ జోక్యం తొలగించి, రెవిన్యూ వ్యవస్థ కి అధికారం కట్టబెట్టడం అంటే దారుణం అన్నారు. ఈ విధంగా రెవిన్యూ వ్యవస్థ కి అధికారము కట్టబెట్టడం వెనుక రాజకీయ ఉద్దేశ్యం,రాజకీయ లబ్ది కన్పిస్తున్నాయి. ప్రజా ఉపయోగం మాత్రం లేదు అన్నారు. ఈ చట్టం వల్ల భూములు, ఆస్తులు పై సామాన్యుడు, హక్కు,అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రజా హితం కోరుతూ న్యాయ వాదులు న్యాయం గా చేస్తున్న ఈ పోరాటం నకు మా పార్టీ అధిష్టానం ఇప్పటికే మద్దత్తు ప్రకటించింది. మీ మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దత్తు కూడా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టంశెట్టి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బొంగుళూరి మధుబాబు, గౌరవ అధ్యక్షులు కొల్లా వీర్రాజు, చెలంకూరి రామకృష్ణ, ట్రెజరర్ జొన్నాడ రాజేష్, జాయింట్ సెక్రటరీ రాయి శ్రీనివాసరావు, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ లింగంపల్లి శివకుమార్, సీనియర్ మరియు జూనియర్ న్యాయ వాదులు రమణం వీర వెంకటరావు, గరిమెల్ల సుబ్రహ్మణ్యం, పిల్లి బలరాముడు,మూది నారాయణ స్వామి,బాద జాన్ బాబు, బత్తిన సింహాచలం, కిలపర్తి శ్రీనివాస్, ఆకుల హరిబాబు, బండారు నరసింహారావు, పలివెల నాగేంద్ర రాజు, కాపిశెట్టి శ్రీనివాసరావు, ఆకాశపు మల్లేశ్వరరావు, బోడపాటి అశోక్, మాదల మంజూష, అవసరాల దేవి, రాయి అచ్యుత రామారావు, రెడ్నం వెంకటరెడ్డి , కాకరపల్లి లోవదుర్గ, బెహరా లక్ష్మీ ప్రసన్న,తదితరులు పాల్గొన్నారు.