• ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్  
  • బాలశౌరిది ముంచి పోయే తత్త్వం 
  • బాలశౌరికి ముఖ్యమంత్రి జగన్ టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ప్రజలు తెలుసుకోవాలి. 
  • అక్రమాలు, అన్యాయాలు చేసాడు కాబట్టే నో టికెట్. 
  • బాలశౌరి ఒక బఫూన్ అంటూ మంత్రి  అంబటి రాంబాబు  ఫైర్ .   

మా ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారు. అందుకే మా టార్గెట్ 175. దేశంలోనే ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం వైయస్ఆర్సీపీ అని ప్రజలందరికి తెలుసు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. చంద్రబాబు జగన్ ల మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారు. మా పార్టీ మేనిఫెస్టో ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నాము. అది మా ధైర్యం. చంద్రబాబు హయాంలో ఇచ్చిన మేనిఫెస్టో ఏకంగా అదృశ్యమైపోయింది. వెబ్సైట్ కూడా లేదు. 2014 టిడిపి మేనిఫెస్టో చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే వారు దానిని మాయం చేశారు.  ఇది చంద్రబాబు – జగన్ గారి మధ్య ఉన్న తేడా.  

వై నాట్ 175 అనేది మా ధీమా 

రాష్ట్రంలో 175 కి 175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించాలని టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగం గానే అనేక మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాము. మా మ్యానిఫెస్టో పట్టుకొని మాట్లాడే దమ్ము ధైర్యం మా పార్టీకి ఉంది. బాబు కి ఉందా ? 

 

జన సైనికులు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదుతున్నారు. 

నాయకుడు ప్రవర్తన వారి కార్యకర్తలకే అర్ధం కావడం లేదు. సీట్లు, నోట్ల ముష్టి కోసం వెళ్లాడా ?  చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ కళ్ళు అరిగేలా తిరుగుతున్నాడు. ప్యాకేజ్ ముష్టి కోసం వెళ్లాడా? లేక సీట్లు ముష్టి కోసం వెళ్లాడా? జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా… కుక్క తోక పట్టుకొని గోదారి ఈడకండి. చంద్రబాబు మాట విని పవన్ కళ్యాణ్ కార్యకర్తలను నిలువునా ముంచుతాడు. మేము మీకు ముష్టి వేస్తాడు. అది తప్ప మీకు గత్యంతరం లేని పరిస్థితికి తీసుకొచ్చాడు. చంద్రబాబు 20 నుంచి 25 సీట్లు ఇవ్వడంమే గగనమని అందరికి తెలిసిన విషయమే. ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. మీరు మోసపోతున్నారు.   

 

చరిత్రలో నిలబడే విజయాన్ని జగన్ సొంతం చేసుకోబోతున్నారు. 

జగన్ రాష్ట్ర చరిత్రలో నిలబడిపోతున్నారు. తండ్రి లగే మరో మారు గెలిచి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోబోతున్నారు. ఎవరు ఎన్ని వ్యూహాలు పన్నినా , ఎంతమంది కలిసి పోటీ చేసిన గెలుపు మాదే. జగన్ పాలన చూసి రాష్ట్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.తెలుగుదేశం – జనసేన వారు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు ఇప్పటివరకు సిద్దమే కాలేదు. భేటీలతోనే వారి పుణ్యకాలం కాస్త గడిచిపోయేలా ఉంది. మేము సిద్ధం అయ్యి దూసుకుపోతున్నాం. వాళ్ళు నోట్లు, సీట్లు అంటూ లెక్కలేసుకొనే పరిస్థితిలోనే ఉన్నారు. కనబడిన వారందరిని రా… కదలిరా… అంటున్నారు కానీ, ఎవరు కదిలొచ్చే పరిస్థితి లేదు. అందుకే జాయింట్ గా మీటింగ్ లు పెడతారంటా.. సినిమా యాక్టర్ ను చూడడానికి వచ్చిన వాళ్ళందరికి చంద్రబాబు ఉపన్యాసం చెబుతారంటా. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు తీసుకువెళ్ళినట్టు…  పవన్ కల్యాణ్ ను తీసుకెళ్ళి జనాల్ని పోగేసేకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.    

 

లోకేష్ వస్తే టీడీపీ గల్లంతే… 

చిత్రంగా లోకేష్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా  కనిపించట్లేదు వినిపించడం లేదు. కారణాలు వారికే తెలియాలి.  దాచేసినట్టున్నారు. లోకేష్ ని  బయటకు పంపిస్తే టీడీపీ ఔట్ అని హెచ్చిరించినట్టున్నారు. లోకేష్ ను దాచేసినా, బయట పెట్టినా టీడీపీ గల్లంతే.. ఇది వాస్తవం. వీరుడు సూరుడని అని చెప్పి తీసుకెళ్లి పక్కన పెట్టారు. అందుకే మిమ్మల్ని ప్రజలు మరోమారు పక్కనపెట్టే పనిలో ఉన్నారు.   

 

బాలశౌరి ఒక బఫూన్ః

 

మా పార్టీలో టికెట్ లేని బఫూన్ లు వేరే పార్టీలో చేరతారు, ఇక్కడ టికెట్ లేదని చెప్పిన తర్వాత బఫూన్ బలశౌరి వెళ్లి అక్కడ చేరాడు, కొద్దిగా ఓవర్ గా మాట్లాడాడు.. ఓవరాక్షన్ చేస్తేనే తప్ప అక్కడ గుర్తించమన్నట్టున్నారు. చాలా ప్రగల్భాలు పలికాడు.. చాలా ఓవరాక్షన్ చేశాడు. పవన్ కల్యాణ్ బాలశౌరిని ఉద్దేశించి.. ఇప్పటి వరకు అక్కడుండి ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు, వీడిని నమ్మొచ్చా అన్నాడు..

 

 బాలశౌరి జీవిత చరిత్ర అంతా మాకు తెలుసు. 2004 నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, తెనాలి పార్లమెంట్ లో పోటీ చేసిన దగ్గర నుంచి బాలశౌరి గురించి తెలుసు. బాలశౌరి పుట్టుక దగ్గర నుంచి నేటి వరకు అన్నీ తెలుసు. ఇక్కడ తంతే వెళ్ళి జనసేన ఆఫీస్ లో పడ్డాడు. అన్యాయాలు, అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరి. అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే టికెట్ రిజెక్ట్ చేశారు. టికెట్ రిజెక్ట్ చేస్తే జనసేన ఆఫీసులో తేలాడు. 

ఇప్పుడు  జగన్ గారిని దూషించే కార్యక్రమం చేస్తున్నాడు. బాలశౌరిని నమ్మోచ్చా అని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అనుకున్నారంటా. బాలశౌరిని ఎవరూ నమ్మరు.. ఎవరినైనా ముంచిపోయే తత్వమే బాలశౌరిది. గత్యంతరం లేక బందరు టికెట్ ఇవ్వొచ్చు ఏమో .. బాలశౌరిది ముంచిపోయే తత్వమని మనకన్నా నాదెండ్ల మనోహర్ కి, పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు, రాబోయే కాలంలో మీరే చూస్తారు.

 

జగన్ గారు అర్జునుడు అని చెప్పగానే వాళ్ళకి ఎంతగా గుచ్చుకుందో.. దుష్టచతుష్టయం పద్మవ్యూహాలను, పన్నే పన్నాగాలను ఛేదించుకుని రాగలిగే వీరుడు- అర్జునుడు జగన్ గారు. అంటూ తనదాయెను శైలిలో విరుచుపడ్డారు అంబటి.