Latest Posts

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

  • రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నగర శాఖ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకను పార్టి ప్రధాన కార్యాలయం వద్ద పార్టి సెక్యులర్స్, పార్టి శ్రేణులు మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు.

అనంతరం పార్టి అధినేత శ్రీ మేడా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా జాతీయ జండాను ఆవిష్కరించారు.
స్వాతంత్ర్య ఉద్యమ వీరులు నేతాజీ శుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ లను స్మరించుకుని వారికి గౌరవ నివాళులు అర్పించారు.పార్టి అధినేత శ్రీ మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ 75 ఏళ్ల సువిశాల భారతదేశంలో నేటికి ఆకలి చావులు జరుగుతున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘన యదేచ్చగా జరుగుతూనే వుంటున్నాయని, మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందని,పేదరికాన్ని నేటి పాలకులు రోజు రోజుకు పెంచుకుంటు పోతున్నారని, భారతదేశ సంపదను కార్పోరేట్ శక్తులకు నేటి పాలకులు దోచిపెడుతున్నారని, ఓటు హక్కును కిరాయి హక్కుగా మార్చేసారని, ప్రస్తుత రాజ్యాంగం కొంతమంది సంపన్నుల కబంద హస్తాలలో చిక్కుకుపోయిందని,అవినీతి పరుల చేతికి పాలనా పగ్గాలు అప్పగించటంలో కార్పోరేట్, ప్రైవేట్ శక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారని, పసిపిల్లలు, వృద్ధులపై కూడా ప్రస్తుత వ్యాపార రాజకీయ పార్టీల ముసుగులో అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయని, నాటి బ్రిటిష్ పాలకుల కన్నా ప్రమాద కరంగా నేటి పాలకులు రాజ్యమేలుతున్నారని, భారతదేశం లో సామాన్యులకు చట్ట పరమైన స్వేచ్ఛ లేకపోయిందని, భారత్ లో చట్టాన్ని యాచించాల్సి వస్తుందని, న్యాయాన్ని కొనుక్కో వాల్సి వస్తుందని, భద్రత గల సమాజం, సంపద గల దేశం, మానవ హక్కులకు శాశ్వత భద్రత, మెరుగైన పాలనా విధానాలు అమలు జరగాలి అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తోనే సాధ్యం అని, అందుకు ఆర్పిసి నూతన ప్రజా స్వామ్య నిర్మాణం ఎంతైనా అవసరం అని, అందుకు మరో స్వాతంత్ర్య పోరాటంతో భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ కొత్తపల్లి భాస్కరరామం, కాసా రాజు,డివి రమణమూర్తి, ఎవిఎల్ నరసింహారావు, పెండ్యాల కామరాజు, లంక దుర్గాప్రసాద్, ఎండి హుస్సేన్, సిమ్మా దుర్గారావు, దోషి నిశాంత్ , దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మోర్త ప్రభాకర్, కొల్లి సత్యనారాయణ,మేడిచర్ల శ్రీనివాసరావు,వల్లి శ్రీనివాసరావు , గుడ్ల సాయి వెంకట ప్రసాద్ , కారుమూరి శిరీష,బత్తెన రమణ,జిత్తుక అప్పన్న,కాట్రపత్తి మంగనాయుడు , ద్వాదశి శ్రీనివాస్,కొలిపల్లి లక్ష్మారావు , జిత్తుక సత్యనారాయణ, కణితి రమాకాంత్ తదితరులు పాల్గొనియున్నారు.

పార్టిపార్టి పార్టి

Latest Posts

Don't Miss