Latest Posts

విశాఖ హుక్కు పై మోడీని ప్రశ్నించండి-సిపిఐ

  •  విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమానికి ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతు పలకండి-ఏఐటియుసి- సిపిఐ పిలుపు.
  • విశాఖ హుక్కు పై ఆంధ్ర బిజెపి శ్రేణులు మోడీని ప్రశ్నించండి.

రాష్ట్రవ్యాప్తంగా ఏఐటియుసి- సిపిఐ పిలుపులో భాగంగా బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ( పిఎస్) ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమానికి ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేయాలని ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ చౌక ధరలకు బడా కార్పొరేటర్ పరిశ్రమకవేత్తలకు కట్టబెడుతున్నారని, రైల్వే, ఎల్ఐసి, ఎయిర్ ఇండియా, బిఎస్ఎన్ఎల్, పోర్టులు తదితర రంగాలన్నీ ప్రైవేటు పరానికి మొగ్గు చూపుతున్నారని అవి సరిపోక ఆంధ్ర ప్రజల ఆత్మాభిమాన గౌరవాన్ని తాకాట పెట్టడానికి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూ ముందుకు వెళుతుందని, ప్రజా సంఘాలు ప్రజల ఆధ్వర్యంలో సుమారు సంవత్సర కాలం పాటు ఉద్యమం చేపట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిమ్మక్క నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, ఆంధ్ర ప్రజలంతా ఏకమై విశాఖను పరిశ్రమను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకునేందుకు ఈ నెల 30న విశాఖలో జరగనున్న ప్రజా ఉద్యమానికి మద్దతు పలకాలని ఆంధ్ర బిజెపి శ్రేణులు విశాఖ ఉక్కు పై మోడీని ప్రశ్నించాలని ప్రసాదన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రులుగా విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలుగా మనందరికీ ఉన్నదని ఆయన అన్నారు. బిజెపి ప్రైవేటీకరణ విధానాలకు స్వస్థ పలికి ప్రభుత్వ రంగాలను ప్రభుత్వంలోనే కొనసాగేందుకు ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని, బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, ఒక్కొక్క ప్రభుత్వ రంగ వెనక వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని అలాంటిది బిజెపి అధికారంలో వచ్చిన నాటి నుండి నేటి వరకు ఒక పరిశ్రమ గాని ఒక ప్రభుత్వ రంగాలు గాని ఏర్పాటు చేయలేదని ఉన్నవి నిర్వీర్యం చేసే ప్రయత్నంలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నదని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు పప్పు ఆదినారాయణ, పెద్ది రెడ్ల సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, బంగారు రాజేష్, బొత్స శీను, కసింకోట కిషోర్, రామయ్య, అనిల్, వెలిశెట్టి రామదాస్, అర్జున్ రావు, మడగల రమణ, సింగంపల్లి రమణ, గంగాధర్, రాజు, కేశవరపు అప్పలరాజు తదితరులు ఏఐటీయూసీ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖ

Latest Posts

Don't Miss