Latest Posts

విశాఖ ఉక్కు ప్రభుత్వం లోనే కొనసాగాలి-తాటిపాక మధు

  • విశాఖ ఉక్కు ప్రభుత్వం లోనే కొనసాగించాలని కలెక్టరేట్ వద్ద సిపిఐ ఏఐటీయూసీ ధర్నా
  • మోడీ విధానాలను త్రిప్పికొట్టండి- సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

విశాఖ ఉక్కును ప్రభుత్వం లోనే కొనసాగించాలని , మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని కోరుతూ సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లో బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాను ఉద్దేసించి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామికవాదులు పోరాడి సాధించుకున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అధికారంలోకి వచ్చాక బడా కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా అమ్మి వేస్తున్నారని ఆయన విమర్శించారు దేశంలో సహజ వనరులు అయినా గనులు ఇసుక బొగ్గు అమ్మి వేయడమే కాకుండా రైల్వే పోర్టులు అమ్మి వేస్తున్నారని మధు విమర్శించారు 32 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మి వేయడం దుర్మార్గం అన్నారు మోడీ తన విధానాలను విరమించుకునే వరకు పోరాటం ఆపేది లేదని మధు తేల్చి చెప్పారు.ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ జట్లు లేబర్ యూనియన్అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు ఈనెల 30న చలో విశాఖ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా పెద్ద ఎత్తున కార్మిక లోకం తరలిరావాలని రాంబాబు పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కే జ్యోతి రాజు ఆచంట సత్యనారాయణ నిడదవోలు నియోజకవర్గం కార్యదర్శి ఎం ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ సిపిఐ నగర నాయకులు సెపెని రవణమ్మ ఏ టి యు సి నగర కార్యదర్శి, కిర్ల కృష్ణ నల్ల రామారావు నాగబాబు బేగం జట్లు లేబర్ యూనియన్ అధికార బాడీ సభ్యులు దేవుడు బాబు మొదలైన వారు నాయకత్వం వహించారు.

విశాఖ ఉక్కు

Latest Posts

Don't Miss