ఏలేశ్వరం మండలం పరింతడక గ్రామం లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని ప్రచారం నిర్వహించారు ఫిబ్రవరి 15 నుండి 20వ తారీకు వరకు బీహార్ రాష్ట్ర పాట్నాలో జరిగే 11 వ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని కర్రపత్రలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు ప్రజాస్వామ్యాన్ని రక్షించండి భారతదేశన్ని కాపాడండి. ఫాసిస్టు మోడీ షాల ప్రభుత్వం న్ని గద్దె దించండి- నిరంకుశ జగన్ ప్రభుత్వాన్ని నిలదీయండి అని నినాదాలు చేశారు అధిక ధరలు తగ్గించాలని పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంనకి సాబే కోమ్మన్న ఆదివాసీ సంఘం మండల అధ్యక్షుడు నాయకత్వం వహించారు ఏగుపాటి అర్జునరావు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మరియు విప్లవ యువజన సంఘం మండల నాయకులు వై చంద్రశేఖర్ మరియు వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం సభ్యులు రెల్లి దారకొండ, వంతల పండుదోర, సాబే చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు
.