Latest Posts

సమీర్‌శర్మ కు సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీ మాజీ సీఎస్ సమీర్‌శర్మ కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. ఓ ప్రాజెక్ట్‌కు సేకరించిన భూముల్లో నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని 2021లో సుప్రీంకోర్టు ఆదేశించింది.అయితే తనకు పరహారం ఇవ్వలేదని రైతు వెంకట్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.సమాధానం చెప్పాలని సమీర్‌శర్మకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు రుజువైతే, భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్‌కు హెచ్చరించింది.తదుపరి విచారణ మార్చి 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Latest Posts

Don't Miss