జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తమ్ముడు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది.కాగా రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంది. అవినాష్ రెడ్డి తాను CBI ఎలాంటి దర్యాప్తు చేసినా తప్పక సహకరిస్తానని దర్యాప్తునకు పూర్తిస్థాయిలో నా సహకారాన్ని అందిస్తానని ,కాని ఒక రోజు ముందుగా చెప్పి హాజరు కావాలనడం సమంజసం కాదని చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నానని 5వ తేదీవరకు గడువు ఇస్తే అన్ని పనులు ముగించుకుని ఆ తర్వాత మీరు ఎప్పుడు హాజరు కావాలని చెప్పినా సరే హాజరు అవుతానని సీబీఐ కి లేఖ రాశారు.