లోకేష్ పాదయాత్రకు పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది. అయితే టిడిపి నాయకులు దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది . పోలీసు శాఖ విధించిన ఆంక్షలు పాదయాత్రలో పాటించలేమని.. ఇలాంటి షరతులతో కూడిన అనుమతి తమకు వద్దని టిడిపి నేతలు రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.టిడిపి వాళ్లు దరఖాస్తు చేసుకున్న విషయం, నిబంధనకు లోబడి ఎలాంటి షరతులతో అనుమతి ఇచ్చామనేదానిపై పోలీస్ అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.