Latest Posts

జాతీయ హోదా సాధించడానికి బిఆర్ఎస్ స్కెచ్

జాతీయ హోదా సాధించడానికి బిఆర్ఎస్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని (భారత్ రాష్ట్ర సమితి) భావిస్తున్నట్లు కనిపిస్తోంది. జాతీయ హోదా దక్కాలంటే వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసి నిర్ధిష్ట ఓటింగ్ శాతం సాధించాల్సి ఉంటుంది.బిఆర్ఎస్ ఇప్పుడు ఆ దిశగానే పావులు కదుపుతోందంట, తాజాగా మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది.ఆయా రాష్ట్రాల్లో పోటీ చేయడానికి గులాబీబాస్ నిర్ణయించారంట.బిజెపిపై యుద్దం ప్రకటించిన బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో పాగా వేసేందుకు చకచకా పావులు కదుపుతోంది.అంది వస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని పార్టీకి జాతీయ హోదా కల్పించేందుకు పార్టీ అధినేత కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు.ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది.ఈశాన్య ప్రాంతానికి చెందిన మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆ రాష్ట్రాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతోంది. తాజాగా నాగాలాండ్ కు చెందిన ఓ ప్రముఖ నేత హైదరాబాద్ విచ్చేయడమే అందుకు నిదర్శనమంటున్నారు.బీఆర్ఎస్ నాయకులను కలిసి తమకు ఆర్థిక సాయం చేస్తే బీఆర్ ఎస్ తరుపున పోటీ చేయడానికి రెడీ అని ఆయన సంకేతాలు ఇచ్చారంట.

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు తెచ్చుకున్న బీఆర్ఎస్‌ జాతీయ హోదా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.జాతీయహోదా దక్కాలంటే 1968 కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం.. ఒక పార్టీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి.ఆయా ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం 6 శాతం సాధించాలి.ఈశాన్య రాష్ట్రాలు సహజంగానే విస్తీర్ణం పరంగా చిన్నవి,కాబట్టి ఈ రాష్ట్రాల్లో నిర్ధిష్ట ఓటు శాతం సాధించడం సులభమని బీఆర్ఎస్ భావిస్తోందంట.సరైన స్థానిక నేతలను చేర్చుకుంటే అక్కడున్న ఓటర్లను ఆకట్టుకోవడంపెద్ద కష్టమేమీ కాదన్నది బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోందంట.ఇటీవల నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లోథా బిఆర్ఎస్ నేతలను కలిశారు. తనకు బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే అవకాశం కల్పిస్తే తన పార్టీని విలీనం చేస్తానని చెప్పినట్లు సమాచారం,ఈయన బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయ ప్రారంభానికి కూడా హాజరయ్యారు.దీంతో బీఆర్ఎస్ నేతలు ఆయన గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు త్రిపురకు చెందిన కొంతమంది నేతలను బీఆర్ఎస్ ప్రతినిధులు సంప్రదిస్తున్నారంట.గతంలో కమ్యూనిస్టు కోటాగా పేరున్న ఈ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన వామపక్షాల నేతలు టచ్‌లోకి వెళ్తున్నారంట,తెలంగాణలో వామపక్షాలు బీఆర్ఎస్ మిత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే,ఇక మేఘాలయలో క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు.ఆ కోణంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవకపోయినా నిర్ధిష్ట ఓటింగ్ శాతం రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట,ఈ రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఓటింగ్ సాధిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరింత ధీమాగా మిగతా రాష్ట్రాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని బిఆర్ఎస్ భావిస్తోందంట,అందుకే ఈ రాష్ట్రాల ఎన్నికలను కేసీఆర్ సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారంట,ఆ క్రమంలో ఇప్పటికే కొంతమంది నేతలను సంప్రదించిన బీఆర్ఎస్ ప్రతినిధులు త్వరలో మరింత మందిని కలిసి పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారంట.మేఘాలయ బిజెపికి పట్టున్న రాష్ట్రం,నాగాలాండ్ కూడా బీజేపీ నేతలకే పట్టం కడుతున్నారు,త్రిపురలో సంకీర్ణం ద్వారా బీజేపీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఆ రాష్ట్రాల్లో ఓటుబ్యాంకు సాధిస్తే బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనని చాటుకోవడానికి అవకాశముంది.అందుకే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారంటున్నారు

Latest Posts

Don't Miss