Latest Posts

కాకినాడ నగరాధ్యక్షురాలిగా శివప్రసన్న

 

నగరాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన శివప్రసన్న,అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ద్వారంపూడి 

వైఎస్సార్‌సీపీ కాకినాడ నగరాధ్యక్షురాలిగా మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్నసాగర్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 9.50 నిమిషాలకు పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యాలయంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆమెను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రం కాకినాడలో పార్టీ అధ్యక్షుని పాత్ర ఎంతో కీలకమన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు చేపట్టే వివిద కార్యక్రమాలతోపాటు నగరంలో వైఎస్సార్‌సీపీ పటిష్టత కోసం నూతన అధ్యక్షురాలు సుంకర శివప్రసన్నసాగర్‌ పటిష్టవంతమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని సూచించారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కేడర్‌ను సమన్వయం చేసుకుని బూత్‌స్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయాలన్నారు. పార్టీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్నసాగర్‌ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇందుకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా కష్టించి పనిచేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ బెండా విష్ణుమూర్తి, త్రిపురసురందరి ఆలయకమిటీ ఛైర్మ్‌న్‌ పెద్ది రత్నాజీ, మాజీ డిప్యూటీ మేయర్‌ పసుపులేటి వెంకటలక్ష్మి, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.ఎస్‌.రాజు, హెచ్‌ఎంఎస్‌ అధ్యక్షుడు సత్తిబాబు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss