బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ కామెంట్స్ :
- ఏపీ లో పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీ యే.
- ఇండియా ప్రపంచ ఎకానమీలో 5వ స్థానంలో ఉంది.
- త్వరలో 3వ స్థానం కు రాబోతుందని గర్వంగా చెప్తున్నాం.
- ప్రపంచ దేశాలు మన దేశ నాయకత్వం వైపు చూస్తున్నాయి.
- ఎన్నో దేశాల్లో లక్షలాది మంది కరోనా తో, పేదరికంతో చనిపోతున్నా మన దేశంలో మాత్రం క్షేమంగా ఉండడానికి కారణం మోడీ పాలనే..
- అటువంటి పాలన ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా రావాల్సిన అవసరం ఉంది.
- ఏపీ లో ప్రాంతీయ పార్టీల పాలన నిరాశాజనకంగా ఉంది.
- ఏపీ లో గత టీడీపీ చంద్రబాబు పాలన అవినీతి మయం.
- ఐదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయకుండా చంద్రబాబు కేంద్రం మీద నిందలు వేశారు.
- 2019 లో జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఇంకా నిరాశకు గురయ్యారు.
- రూ.4 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏపీ లో ఆకలి చావులు పెరిగిపోయాయి.
- మొత్తం 9 ఏళ్లలో ఏపీ లో టీడీపీ, వైసీపీ పాలనలో ఎలాంటి తేడా లేదు, రెండూ ఒక్కటే
- వాళ్ళని ఎన్నుకున్నందుకు ఏపీ ఓటర్లు ఓడిపోయారు.
- మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.
- గవర్నర్ ని ఉద్యోగులు కలిస్తే ప్రభుత్వం కక్షకట్టడం ఏంటి..
- ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం.
- వచ్చే ఏడాదిలో వైసీపీ పాలనపై ఛార్జ్ షీట్ తో బీజేపీ ప్రజల్లోకి రాబోతుంది.
- నేషనల్ అజెండా తో వచ్చే బీజేపీ ని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆదరించాలి-కేంద్ర మంత్రి మురళీధరన్.