Latest Posts

రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన జక్కంపూడి రాజా

  • రాజేష్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం-జక్కంపూడి రాజా
  • రూ.10 లక్షల ఆర్థిక సాయానికి కృషి…
  • సొంత ఇల్లు సమకూరుస్తాం..
  • హంతకులను కఠినంగా శిక్షించేలా చర్యలు-వైసీపీ జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా.

ఇటీవల ధవళేశ్వరంలో హత్యకు గురైన ఆండ్ర రాజేష్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హామీయిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ సోమవారం పరామర్శించారు. రాజేష్ తల్లిని వారు ఓదార్చారు.ఈసందర్భంగా రాజా విలేఖర్లతో మాట్లాడుతూ జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఏడాది క్రితమే తండ్రి కన్నుమూయడంతో రాజేష్ రెక్కల కష్టం పైనే ఆ కుటుంబం ఆధారపడివుందని,ప్రస్తుతం రాజేష్ కూడా చనిపోవడంతో పరిస్థితి హృదయవిదారకంగా ఉందన్నారు.చేతికి అందివచ్చిన కొడుకు అతి కిరాతకంగా చనిపోవడంతో ఆ తల్లి రోదన వర్ణనాతీతంగా ఉందన్నారు.రాజేష్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించడానికి చందన నాగేశ్వర్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని రాజా ప్రకటించారు.అద్దె ఇంట్లో ఉంటున్న రాజేష్ కుటుంబానికి సొంత ఇల్లు సమకూరుస్తామన్నారురాజేష్ హత్యకు కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకునేలా పోలీసు శాఖ ద్వారా కృషిస్తామని రాజా తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడె ప్రవీణ్, వాసంశెట్టి గంగాధర్,మాజీ ప్రెసిడెంట్ పిన్నిటి ఏకబాబు,మాజీ వార్డ్ మెంబెర్ చంటి, తలారి ప్రసాద్, బాషా,పలువురు వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన జక్కంపూడి రాజా

Latest Posts

Don't Miss