Latest Posts

కలెక్టర్ గారు..!ఎస్పీ గారు..! రక్షించండి

అయ్యా కలెక్టర్ గారు! జిల్లా ఎస్పీ గారు! మండపేట, అర్తమూరు, కాల్ మనీ వేధింపుదారుల చేత,మాకు అన్యాయం జరుగుతున్నది! మైనారిటీ తీరని మమ్మల్ని బలవంతంగా 15 కాళీ నోట్లపై, 100 రూపాయల స్టాంపు 10 పేపర్లుపై బలవంతంగా సంతకాలు తీసుకుని, సేకరించుకుని, కొంతమంది, ఒక మహిళతో కలిపి ఫైనాన్స్ ఇచ్చే ముఠాగా ఏర్పడి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. మేము నిరుపేదలము! మాకు చావు తప్ప మరే మార్గం లేదు! తమరు ఆదుకొని కాపాడకపోతే కచ్చితంగా చనిపోతాం! సారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలోని, ఆలమూరు మండలంలోని, కలువ చర్ల గ్రామానికి చెందిన బీసీ శెట్టిబలిజ కులస్తులైన మమ్మల్ని, మా కుటుంబాన్ని కాల్ మనీ వేధింపుదారులు చాలా అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తూ, ఇబ్బందులు పెడుతూ, మా జీవితాలతో చలగాటం ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇక బ్రతకలేము. మమ్మల్ని, మా కుటుంబాన్ని అంతం చేస్తామని, కిడ్నీలు తీసుకుని అమ్మి వేస్తామని బెదిరిస్తే మాకు దారి లేక మా సంతకాలు కాళీ నోటు పేపర్లపై గత సంవత్సరం పెట్టించుకుని ఉన్నారని, వీరు మండపేట, అర్తమూరు గ్రామాలకు చెందిన కొంతమంది అధిక వడ్డీలు వసూలు చేసే రాబందులని, తెలియజేస్తూ ఉన్నాము. మాకు దారి లేదు. మా తండ్రి కనబడటం లేదు. గత రెండు మూడు రోజుల నుంచి పూర్తిగా మా ఇంటికి రావడం లేదు. మా తండ్రి చాలా అమాయకుడు, ఒక మహిళ చేత కొంతమంది ఆమెతో కలిసి ఫైనాన్స్ మాఫియా వ్యాపారం చేస్తూ, కొంతమందితో, ఇద్దరు వ్యక్తులు పాల డైరీ ముసుగులో అక్రమంగా పాలు పోసే రైతులు చేత ఒక రూపాయి వడ్డీకి అడ్వాన్సుగా కొంత డబ్బులు ఇస్తున్నామని చెప్పి తరువాత పది రూపాయలు, 15 రూపాయలు వడ్డీ అని అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇలాంటి కుట్రలు చేస్తూ వారి కుటుంబాలను కాలరాస్తున్నారు. గత నెలలో అక్రమంగా మాకు సంబంధించిన సుమారు 16 లక్షల నుంచి 20 లక్షల వరకు విలువ చేసే ఎనిమిది పెద్ద గేదెలను పూటకి ఒక్కొక్క గేది ఎనిమిదిలేషన్ చొప్పున 40, 50 లీటర్లు పాలు ఇచ్చే 8 గేదెలను మండపేట డైరీ వారు అక్రమంగా నాలుగు ఆటోలలో రెండు కార్లపై వచ్చి దౌర్జన్యంగా బెదిరించి తోలుకొని, వెళ్లినారు. అడ్డు వస్తే చంపేస్తామని నా తల్లిదండ్రులను అంతు చూస్తామని బెదిరించినారు. గతంలో మా చేత బలవంతంగా కాళీ నోటు పేపర్ పై, వంద రూపాయలు దస్తావేజులపై, బలవంతంగా మా గేదెల పాక వద్దకు, ఇంటికి వచ్చి గత కొద్ది మాసాల కిందట సంతకాలు తీసుకుని ఈరోజు మమ్మల్ని వీధిపాలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఒక మహిళను అడ్డం పెట్టుకుని, ఆమెచేతిలో నా తండ్రికి ముందు పెట్టించి, మోసం జరిగినది. ఈ విషయం మాకు ఇప్పటి వరకు తెలియదు. నా తండ్రి ఆవేదనను చూసి మేము దిగమింగుకోలేక చావలేక బతకలేక ఉన్నాం. మాకు ఒక చిన్న పూరేగుడేసు తప్ప,ఇక ఏ విధమైన ఆస్తి పాస్తులు లేవు. కాళీ నోట్లో సంతకాలు సేకరించి అన్నింటిని వారి పేరుమీద మార్చుకుని కొన్నిటిని కోర్టులో వేసి ఉన్నారు. ఇంకా 30 కాళీ నోట్లను, పేపర్లను ఈ ఏడుగురు వ్యక్తులు చేతిలో సుమారు 10 చెక్కులను ఖాళీ పేపర్లపై దస్తావేజులపై సంతకాలతో వారి చేతిలో పెట్టుకుని మమ్మల్ని నరకం చూపిస్తూ ఉన్నారు. వీరంతా కలిసి మండపేట పట్టణానికి చెందిన ఆర్. వీర్రాజు అనే ఫైనాన్సర్ చేత సుమారు 17 లక్షల వరకు నా తండ్రి బాకీ ఉన్నదని ఖాళీ నోటు పేపర్ను తీసుకుని ఒకదానిపై పూర్తిచేసి కోర్టు ద్వారా పంపించి మమ్మల్ని ఆందోళనకు గురిచేసి ఉన్నారు. ఈరోజు వరకు అతని ఎవరో మాకు కనీసం తెలియదు నా తండ్రికి నా కుటుంబ సభ్యులకి ఎవరికీ కూడా తెలియదు అదేమిటి అని అంటే, వారు ఇచ్చారు వీరు ఇచ్చారు కాళీ నోటు పేపర్లు అందుకే వేశాను అని సమాధానం అడిగిన పెద్దలకు చెబుతున్నాడు. ఇలాగే గతంలో కొన్ని కాగితాలు కూడా కోర్టు ద్వారా పంపించి ఉన్నారు. అదేవిధంగా నా తల్లి అమాయకురాలు ఆమె చేత కూడా కాళీ నోటు 10 పేపర్లపై సంతకాలు పెట్టించుకుని మా చేత కూడా పెట్టుకుని మమ్మల్ని నిలువ నీడ లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఒక మహిళ మా తండ్రిని మోసం చేసి ఆమె డబ్బులు కాజేసినట్లు గ్రామస్తులకు కూడా తెలుసు అని మాకు ఈ రోజే తెలిసింది. వారి చేతిలో మా తండ్రి ఇరుక్కున్నాడని, అమాయకుడని,మోసపోయాడని మేము మాకు ఇప్పుడు తెలిసినది. దయుంచి రక్షించండి.

Latest Posts

Don't Miss