Latest Posts

పరిశ్రమలో స్థానికులకు అవకాశం ఇవ్వండి-తాటిపాక మధు

  • ప్రతి పరిశ్రమలో స్థానికులకు అవకాశం ఇవ్వండి లేకుంటే స్థానికులు తిరగబడతారు.
  • ఏఐటీయూసీ డైరీ ఆవిష్కరణలో తాటిపాక మధు.
  • పనులు దొరకగా ఉపాధి కోల్పోతున్న స్థానికులు.
  • విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మూడు రోజులు ఆందోళన బాట ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్.

స్థానిక పరిశ్రమలు ,భవన నిర్మాణం వ్యవసాయ రంగం ,అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాల వారు కారు చౌకుగా దొరుకుతున్నారని దీంతో స్థానికులకు అవకాశం కల్పించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు ఆదివారం ఉదయం స్థానిక పిఆర్ భవన్లో ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ ఈ జిల్లాలో ఏ పనుల్లో చూసిన ఇతర రాష్ట్రాల వారే కనబడుతున్నారని కారణం వారితో రాత్రి పగలు శ్రమదోపిడి చేయించుకుంటూ తక్కువ వేతనంతో పని చేయిస్తున్నారని వారు ఎవరికి కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదని స్థానికులైతే ఎక్కువ వేతనం ఇవ్వాలని కారణంతో స్థానికులకు పనులు కల్పించడం లేదని మధు ఆవేదన వ్యక్తం చేశారు జగనన్న కాలనీ నిర్మాణంలో 90 శాతం మంది ఇతర రాష్ట్రాల వారే పనిచేస్తున్నారని గతంలో సీలింగ్ పనులు మాత్రమే నార్త్ వారు వచ్చేవారిని ఇప్పుడు పెయింటింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రిషన్ చివరికి టెంట్ పనులు కూడా వారే చేస్తున్నారన్నారు స్థానిక పరిశ్రమల్లో మహిళలను కూడా ఒరిస్సా,బీహార్ గుజరాత్ రాష్ట్రాల నుండి తీసుకొచ్చి తక్కువ వేతనంతో పని చేస్తున్నారని మధు విమర్శించారు దీనివల్ల స్థానికులకు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు ప్రతి రంగంలో ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం ఇవ్వాలని మధు డిమాండ్ చేశారు దీనిపై సిపిఐ ఏఐటీయూసీ కార్యచరణ తీసుకుంటుందని దశల వారి ఆందోళన చేస్తామని మధు తెలిపారు ఈ జిల్లాలో ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నాడని అటు మోడీ ఇటు జగన్ ఇద్దరు నిరుద్యోగులను నట్టేట ముంచారని మధు విమర్శించారు

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ 23, 24, 25 తేదీలలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నామని దీనికి అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు స్థానిక ఉపాధి అనే అంశంపై అన్ని వర్గాల వారిని కలిసి పోరాట కార్యక్రమం చేస్తామన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగుల సంఘం రీజనల్ కార్యదర్శి కె ఆదినారాయణమూర్తి ,ఉద్యోగ సంఘాల నాయకులు చింతపల్లి సుబ్బారావు ఏఐటీయూసీ సీనియర్ నాయకులు పిఎస్ నారాయణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు ఆర్టీసీ యూనియన్ నాయకులు జార్జి బాబు ఏఐటీయూసీ నగర కార్యదర్శి టి అన్నవరం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ యూనియన్ నాయకులు ఎంఎస్ నారాయణ ప్రభుత్వ ఆసుపత్రి నాయకులు రామయ్య మున్సిపల్ యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ రామకృష్ణ హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు

Latest Posts

Don't Miss