14,523 గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్.. ఏప్రిల్‌లో పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే..ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి చేసిన విషయం తెల్సిందే.2023 ఏప్రిల్లోపే మూడో విడత నోటిఫికేషన్‌కు సంబంధించిన రాతపరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నారు.ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే రాతపరీక్షలతో సహా మొత్తం భర్తీ ప్రక్రియను చేపడతారు. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇటీవలే పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది. అలాగే ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొంది. మొత్తం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.