Latest Posts

పదివేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన హౌసింగ్ ఇ.ఇ

 

పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా హౌసింగ్ ఇ.ఇ. బి. తారాచంద్  ఎసిబి అధికారులకు చిక్కారు.వివరాలు ఇలా ఉన్నాయి.. అదే శాఖలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి విధి నిర్వహణలో సరిగా లేరన్న కారణంతో పై అధికారులు చర్యలు తీసుకున్నారు.. తరువాత తిరిగి ఉద్యోగంలో చేరారు… సస్పెండ్ అయిన కాలానికి సంబందించి సగం వేతనం వస్తుంది..ఇందుకోసం ప్రసాద్ దరఖాస్తు చేసుకున్నారు. మంజూరు చేయాలి అంటే ప్రాజెక్టు అదికారిగా ఉన్న తారాచంద్ సంతకం చేయాల్సి ఉంది.. గత కొంతకాలంగా ప్రసాద్ తారాచంద్ చుట్టూ తిరుగుతున్నారు.. అయినా సరే కనికరించలేదు.. సంతకం చేయడానికి పదివేలరూపాయలు డిమాండ్ చేశారు.. ప్రసాద్ ఎసిబి అధికారులను ఆశ్రయించారు.. గురువారం లంచం సొమ్ము స్వీకరిస్తు ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఎసిపి అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఎసిబి అడిషనల్ ఎసిపి సి.హెచ్ సౌజన్య, ఇనస్పెక్టర్లు వి. పుల్లారావు, డి.వాసు కృష్ణ, వై. సతీష్ సిబ్బంది పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss