Latest Posts

ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్

 

హజరత్ సయ్యద్ బాలే మస్తాన్ షావలీ దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్.నందిగామ పట్టణ‌ శివారు చందాపురం బైపాస్ లో గల హజరత్ సయ్యద్ బాలే మస్తాన్ షావలీ దర్గా ఉరుసు ఉత్సవాల్లో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న బాలే మస్తాన్ షావలీ దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని, కులమతాలకు అతీతంగా పరిసర ప్రాంతాల భక్తులు ఎంతో నమ్మకంతో బాలే మస్తాన్ షావలీ దర్గాను కొలుస్తారని తెలిపారు, దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు .. ముందుగా దర్గాకు విచ్చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో ప్రార్ధనలు జరిపించారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షులు పితాన్ మేస్త్రి, కో ఆప్షన్ సభ్యులు జాఫర్, నాయకులు చిరుమామిళ్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు ..

Latest Posts

Don't Miss