Latest Posts

వ్యవసాయశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

  • ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై సీఎంకు వివరాలందించిన అధికారులు.
  • 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు.2019–20 నుంచి 2022–23 ఖరీప్‌ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్‌ టన్నులు.
  • రబీకి సంబంధించి ఇ– క్రాప్‌ బుకింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన అధికారులు.
    మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని వెల్లడి.
  • రబీలో కూడా రైతులకు విత్తనాల పరంగాగాని, ఎరువుల పరంగాగాని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశం.
  • ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించిన సీఎం.
    దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం.
  • సీఎం ఆదేశాల ప్రకారం ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, కిసాన్‌ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలిపిన అధికారులు.
  • ఈ ఏడాది మార్చి, మే–జూన్‌ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపిన అధికారులు.
    2వేల డ్రోన్లను పంపిణీ చేసేదిశగా కార్యాచరణ చేశామన్న అధికారులు.
  • తొలివిడతగా రైతులకు 500 ఇస్తామని తెలిపిన అధికారులు.
  • గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని తెలిపిన అధికారులు
  • .శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్న అధికారులు.
  • ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి.
  • ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలన్న సీఎం.
  • ఉత్తరాంధ్రలో కూడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
  • ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌పై సమీక్ష
  • గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌పై కార్యాచరణ, శాయిల్‌ టెస్టింగ్‌ ప్రతి ఏటా కూడా ఏప్రిల్‌ మాసంలో జరిగేలా చూసుకోవాలన్న సీఎం.
  • టెస్టు అయిన తర్వాత సర్టిఫికెట్లను రైతులకు ఇవ్వాలన్న సీఎం.
  • ఫలితాలు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులకు మార్గనిర్దేశం చేయాలన్న సీఎం.
    అప్పుడు ఆ పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్న సీఎం.
  • నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబుల్లో వీటి పరీక్షలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామన్న అధికారులు.
  • భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో కూడా శాయిల్‌ టెస్ట్‌ పరికరాలు ఉంచాలన్న సీఎం. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాలన్న సీఎం.
  • ప్రతి గ్రామంలో శాయిల్‌ టెస్టింగ్‌ తర్వాత మ్యాపింగ్‌ జరగాలన్న సీఎం.
  • దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాలమేరకే జరుగుతుందని, రైతులకు పెట్టబడులు ఆదా అవడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుతుందన్న సీఎం.
  • మాండస్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశం.
    సీఎం ఆదేశాల మేరకు సబ్సిడీపై వెంటనే విత్తనాలు అందించామని తెలిపిన అధికారులు.
  • అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామన్న అధికారులు.
  • ధాన్యం సేకరణపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
  • సీఎం ఆదేశాల మేరకు మొదటి సారిగా గన్నీబ్యాగుల డబ్బులు, రవాణా ఖర్చులు ఇవన్నీకూడా రైతులకు ఇచ్చామన్న అధికారులు.
  • సీఎం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలమేరకు ఇప్పటికే రైతులకు 89 శాతం చెల్లింపులు జరిగాయన్న అధికారులు.
  • సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులకు చెల్లింపులు చేశామన్న అధికారులు.
    సంక్రాంతి పండుగ వేళ రైతుల్లో సంతోషాన్ని నింపిందని తెలిపిన అధికారులు.
  • ఇప్పటివరకూ రూ. 5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామన్న అధికారులు.
    ఇంకా సేకరణ కొనసాగుతుందన్న అధికారులు.
  • ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండోవారం వరకూ సేకరణ కొనసాగుతుందన్న అధికారులు.
  • ఇ–క్రాప్‌ డేటా మేరకు ధాన్యం కొనుగోలు చేయాలన్న చేయాలన్న సీఎం.
  • స్థానిక వీఏఓ నుంచి డీఆర్‌ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతనే సేకరణ ముగిస్తామన్న అధికారులు.
    సీఎం ఆదేశాల మేరకు మిల్లర్లు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తొలిసారిగా ధాన్యం సేకరణ బాగా జరిగిందన్న అధికారులు.
  • మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ కూడా జరగాలన్న సీఎం.
  • రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలన్న సీఎం.
  • ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్న సీఎం.
    రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు : సీఎం
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది,ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత.
  • ఈ అంశాలన్నీ రశీదులమీద స్పష్టంగా పేర్కొనాలన్న సీఎం.
  • ఏమైనా సమస్యలున్నా, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నా ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించిన సీఎం.
  • ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వం ఏరోజు కూడా రైతులకు ఈ రకంగా మేలు చేయలేదన్న సీఎం
    గత ప్రభుత్వంతో పోలిస్తే.. సేకరణ కూడా ఈ ప్రభుత్వంలో అధికంగా జరిగిందన్న సీఎం.
  • చివరకు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించిందన్న సీఎం.
  • చంద్రబాబు హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు రూ.8వేల కోట్లు అయితే మన ప్రభుత్వం హయాంలో ఏకంగా రూ.15వేల కోట్లు సగటున ఏడాదికి ధాన్యం సేకరణకు పెడుతున్నామన్న సీఎం.
  • అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయన్న సీఎం.
  • ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వివక్షలేకుండా, అవినీతికి తావులేకుండా జరుగుతోందన్న సీఎం.
    ఇంతకుముందు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భం లేదన్న సీఎం
  • అలాంటి ధాన్యాన్నికూడా మనం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్న సీఎం.
  • రేషన్‌లో కోరుకున్న వారికి చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నామన్న పౌరసరఫరాలశాఖ అధికారులు.

Latest Posts

Don't Miss