- మంగళగిరి లో ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
- గురువారం నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు- అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి వై. మధుసూదన రెడ్డి
మంగళగిరి లో ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుంది. మంగళగిరి లోని ఆటోనగర్ లో సువిశాలమైన పీవీఎస్ లాండ్ మార్క్ భవనం లో గురువారం నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి వై.మధుసూదన రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కార్యాలయం ను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు గుంటూరు లో ఉన్న అటవీ శాఖ ప్రధాన కార్యాలయం ఇకనుంచి మంగళగిరి లో కొలువు తీరనుంది.