Latest Posts

ఖమ్మం టౌన్ నుండి మళ్ళించిన దారి వివరాలు

 

కమీషనర్ అఫ్ పోలీస్, ఖమ్మం వారి కార్యాలయం నుండి తెలియ జేయునది ఏమనగా తేది.18.01.2023 న ఖమ్మం నగరంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఖమ్మం పర్యటనలో భాగముగా ఖమ్మం నందు నిర్మించిన కొత్త కలెక్టరేట్ కార్యాలయ సముదాయాల ప్రారంబోత్సవం మరియు అనంతరం జరిగే భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ భారీ బహిరంగ సభ ఉన్నదున తేది.18.01.2023 న ఉదయం 06:00 గంటల నుండి 23:00 గంటల వరకు ఖమ్మం వైపునకు వచ్చు సాదారణ మరియు భారీ వాహనాల ట్రాఫిక్ ను క్రమబద్దీకరించుట లో భాగముగా ఈ క్రింద తెలిపిన రూట్లలో ఖమ్మం టౌన్ నుండి దారి మళ్ళించనైనది అని విజ్ఞప్తి చేయుచున్నాము.

ఖమ్మం నగరంలోని వారు ప్రయానించుటకు దారి మళ్లించిన వాహనాలు వెళ్ళు మార్గాలు:

  • ఖమ్మం నగరం లోనుండి హైదరాబాద్ మరియు వరంగల్ వైపు వెళ్ళు వారు నాయుడు పేట, ఏదులాపురం -వరంగల్ క్రాస్ రోడ్డు, మీదుగా మరిపెడ బంగ్లా-తోర్రురు- హైదరాబాద్/వరంగల్ వైపు వెళ్ళవలెను.
  • ఖమ్మం నగరం లోనుండి విజయవాడ, వైరా రాజమండ్రి మరియు సత్తుపల్లి వైపు వెళ్ళు వాహనాలు వేంకటగిరి క్రాస్ రోడ్డు – కోదాడ- విజయవాడ హై వే వైపువెళ్ళవలెను.
  • ఖమ్మం నగరం లోనుండి ఇల్లందు వైపు వెళ్ళు వాహనాలు రామన్న పేట, డోర్నకల్, మహాబుబాబ్ వైపువెళ్ళవలెను.
  • ఖమ్మం నగరం లోనుండి కోదాడ వైపు కు వెళ్ళు వాహనాలు ముస్తఫ నగర్ మీదుగా బోనకల్–చిల్లకల్లు వైపు వెళ్ళవలెను.
  • ఖమ్మం నగరం లోనుండి మహబూబాబాద్ వైపు కు వెళ్ళు వాహనాలు నాయుడు పేట క్రాస్ రోడ్డు, ఏదులాపురం జంక్షన్ , తిరుమలాయపాలెం మరిపెడ మీదుగా మహబూబాబాద్ వైపువెళ్ళవలెను.

కావున ప్రజలందరికి మనవి చేయునది ఏమనగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండుట వలన అత్యవసర ప్రయాణాలు తప్ప, అనవసర ప్రయణాలను చేయకండి, ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడవలసి వస్తుంది. కావున తేది 18.01.2023 న ఉదయం 0600 గంటల నుండి 2300 గంటల దారి మళ్లించిన మార్గాలను గుర్తించి ఆ మార్గాలలో మీ ప్రయాణాలను కొనసాగించి ఖమ్మం పోలీస్ వారికి సహకరించగలరు అని విజ్నప్తి చేయుచున్నాము.

ఖమ్మం వైపునకు వచ్చు సాదారణ మరియు భారీ వాహనాల ట్రాఫిక్ క్రమబద్దీకరించుట భాగంగా దారి మళ్లించిన వాహనాలు వెళ్ళు మార్గాలు

  • సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం కొత్త బైపాస్ రోడ్డు వైపునకు (కొత్త హైవే) వచ్చు సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం పాత రోడ్డు వైపునకు సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • సూర్యాపేట టౌన్ నుండి ఖమ్మం పాత బైపాస్ రోడ్డు వైపునకు సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • కోదాడ నుండి ఖమ్మం వైపు కు వచ్చు వాహనాలు విజయవాడ హై వే వైపు కు దారి మల్లించటం జరిగినది
  • కూసుమంచి కి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు మూటాపురం, నేలకొండపల్లి కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • ఖమ్మం రూరల్ PS లిమిట్స్ లోని వేంకటగిరి క్రాస్ రోడ్డు వైపు కు వచ్చు వాహనాలు, వేంకటగిరి/ ముదిగొండ – వల్లభి వైపు – చిల్లకల్లు హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • ఖమ్మం రూరల్ లిమిట్స్ లోని కోదాడ క్రాస్ రోడ్డు కి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • ఖమ్మం రూరల్ లిమిట్స్ లోని నాయుడుపేట జంక్షన్ కి వరంగల్ వైపు నుండి వచ్చిన సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళు వాహనాలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్, కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • పెనుబల్లి టౌన్ కి సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి వచ్చిన వాహనాలు తిరువూరు- మైలవరం- విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • తల్లాడ కు సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి వరంగల్ వైపు వెళ్ళు వాహనాలు ఏన్కూర్, తిమ్మారావు పేట, ముచెర్ల క్రాస్ రోడ్డు మీదుగా డోర్నకల్ వైపు దారి మల్లించటం జరిగినది.
  • ఏన్కూర్ కు కొత్తగుడెం, తల్లాడ వైపు నుండి వచ్చు వాహనాలు ఏన్కూరు, తిమ్మారావు పేట, ముచ్చేర్ల క్రాస్ రోడ్డు మీదుగా డోర్నకల్-మహబూబాబాద్ వైపు దారి మల్లించటం జరిగినది.
  • వైరా టౌన్ కు తల్లాడ, సత్తుపల్లి, రాజమండ్రి వైపు నుండి హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్ళు వాహనాలు పాలడుగు–బోనకల్, చిల్లకల్లు హైవే వైపుకు దారి మల్లించటం జరిగినది.
  • పల్లిపాడుకు ఏన్కూర్, జన్నారం వైపు నుండి వచ్చు వాహనాలు వైరా-పాలడుగు-బోనకల్, చిల్లకల్లు హైవే వైపుకు దారి మల్లించటం జరిగినది.
  • ములకలపల్లి క్రాస్ రోడ్డు కు కురవి, మహబూబాబాద్ నుండి హైదరాబద్, విజయవాడ వెళ్ళు వాహానాలు ఎదులపురం సర్కిల్ మీదుగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్-కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • వరంగల్ రోడ్డు లోని ఏదులాపురం క్రాస్ రోడ్డు కు వరంగల్ వైపు నుండి సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం కు వెళ్ళు వాహానాలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్, కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.
  • బోనకల్ గ్రామ సెంటర్ నుండి వచ్చు వాహనాలు తిరిగి చిల్లకల్లు వైపు కు దారి మల్లించటం జరిగినది.
  • ఇల్లందు రోడ్డు లోని ముచ్చర్ల క్రాస్ రోడ్డు వైపు కు వచ్చిన వాహనాలు డోర్నకల్, మహబూబాబాద్ మీదుగా దారి మల్లించటం జరిగినది.

మరిపెడ బంగ్లా కు వరంగల్ వైపు నుండి సత్తుపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం కు వెళ్ళు వాహానాలు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ -కోదాడ క్రాస్ రోడ్డు-వేంకటగిరి క్రాస్ రోడ్, నేలకొండపల్లి -కోదాడ హైవే మీదుగా విజయవాడ వైపు దారి మల్లించటం జరిగినది.కావున ప్రజలందరికి మనవి చేయునది ఏమనగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండుట వలన అత్యవసర ప్రయాణాలు తప్ప, అనవసర ప్రయణాలను చేయకండి, ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడవలసి వస్తుంది. కావున ది.18.01.2023 న ఉదయం 0600 గంటల నుండి 2300 గంటల వరకు ఈ క్రింద తెలిపిన రూట్లలో దారి మళ్లించటం జరుగుతుంది.
దారి మళ్లించిన మార్గాలను గుర్తించి ఆ మార్గాలలో మీ ప్రయాణాలను కొనసాగించి ఖమ్మం పోలీస్ వారికి సహకరించగలరు అని విజ్నప్తి చేయుచున్నాము.

Latest Posts

Don't Miss