Latest Posts

​ ఆర్​ఆర్​ఆర్​ చిత్రంపై ప్రశంసలు కురిపించిన కామెరూన్

హాలీవుడ్ స్టార్ దర్శకుడు, టైటానిక్​, అవతార్​ సృష్టికర్త జేమ్స్​ కామెరూన్​ ఆర్​ఆర్​ఆర్​ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూసినట్లు దర్శకుడు రాజమౌళితో చెప్పారు. ఈ విషయాన్ని జక్కన్నే స్వయంగా సోషల్​మీడియాలో తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ది గ్రేట్ జేమ్స్ కామెరూన్​ ఆర్​ఆర్​ఆర్​ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించారు. తన భార్య సుజీతో కలిసి రెండో సారి కూడా చూశారు. నాతో మాట్లాడుతూ మీరు ఈ సినిమాను పది నిమిషాల పాటు విశ్లేషించడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను సార్​ (జేమ్స్ కామెరూన్​). మీ ఇద్దరికి ధన్యవాదాలు.” అని జక్కన్న పేర్కొన్నారు. ఇక కీరవాణి కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. “ది గ్రేట్స్​ జేమ్స్​ కామెరూన్ మా చిత్రాన్ని రెండు సార్లు వీక్షించారు. నా మ్యూజిక్​పై ఆయన ఫీడ్​బ్యాక్ ఇచ్చారు. ఎంతో ఎక్స్​ట్​మెంట్​గా ఉంది” అని ట్వీట్​ చేశారు.కాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. మరోవైపు భారత్‌ నుంచి 10 చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన చిత్రాలన్నింటికీ ఓటింగ్‌ నిర్వహించి.. నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలను ఈనెల 24న ప్రకటించనున్నారు. అలాగే మార్చి 12న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Latest Posts

Don't Miss