బెంగళూరులో112 అడుగుల ఆదియోగి విగ్రహం ఆవిష్కరణ
బెంగళూరు సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. చిక్బళ్లాపూర్లోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆదియోగి విగ్రహంపై ఏర్పాటుచేసిన రంగురంగుల లేజర్ షో అందరినీ కట్టిపడేసింది. కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.