Latest Posts

18 నుంచి సిపిఐ పోరుబాట

 

  • 18 నుంచి సిపిఐ పోరుబాట.
  • జగనన్న లబ్ధిదారుల వద్దకు సిపిఐ సైన్యం
  • గోడ పత్రిక ఆవిష్కరించిన  జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జగనన్న ఇల్లు నిర్మాణానికి రూ 5 లక్షలు ఇవ్వాలని తిడ్కో ఇల్లును లబ్ధిదారులకు తక్షణం స్వాధీనం చేయాలని కోరుతూ ఈనెల 18 నుంచి సిపిఐ పోరుబాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలియజేశారు సందర్భంగా ఆయన గోడపతిక గోఆవిష్కరించారు ముందుగా మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి స్థలం కేటాయించడం ఆనందదాయకమన్నారు. సిపిఐ అనేక సంవత్సరాలుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసిందని ఆయన గుర్తు చేశారు అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 రూపాయలు ఏమాత్రం సరిపోవని ఐదు లక్షలు పెంచాలని మధు డిమాండ్ చేశారు తెలంగాణ కేరళ ఒరిస్సా తదిత ర రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారని ఇక్కడ మాత్రం తగ్గించడం ఇవ్వడం దారుణం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సిపిఐ ఎర్రసైన్యం ఈ నెల 18 నుండి 30 వరకు లబ్ధిదారుల ఇల్లు వద్దకు వెళ్లి సంతకాల సేకరణ చేస్తుందని జనవరి 30న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఫిబ్రవరి 6న కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహిస్తామని దీనికి అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని మధు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జటులు లేబర్ యూనియన్ అధ్యక్షులు కోండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సిపిఐ నగర సహాయ కార్యదర్శి చప్ప రమణ కార్యవర్గ సభ్యులు సిపిని రమణమ్మ నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు

Latest Posts

Don't Miss