ధర్మాన ప్రసాదరావు ప్రెస్‌మీట్
- సీఎం జగన్‌ను విమర్శించే అర్హత పవన్‌కు లేదు-ధర్మాన ప్రసాదరావు
- ఓ రాజకీయ పార్టీని నడిపే వారు సహనం కోల్పోయి వ్యాఖ్యలు చేయడం తగదు
- శ్రీశ్రీ గారు చెప్పిన వర్గాలకు..సీఎం వైఎస్ జగన్ పథకాలు..గౌరవంగా చేరుతున్నాయి.
- ఉద్దానంకు రూ.800 కోట్లతో మంచినీరు కుళాయిల.. ద్వారా ఇవ్వబోతున్నాం.
- కిడ్నీ బాధితుల కోసం .. పలాసలోనే అత్యాధునిక ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం. బాధితులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
- అన్ని వర్గాల వారు గౌరవంగా బతికేలా.. సీఎం జగన్ పాలన ఉంది.
- శివరామకృష్ణ కమిటీ నివేదికను..పవన్ కల్యాణ్ చదివారా?
- శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది..వికేంద్రీకరణ గురించే
- వికేంద్రీకరణను ప్రపంచమంతా అంగీకరించింది
- ఉత్తరాంధ్ర కోసం ధర్మాన కాకపోతే ఇంకొకరు వస్తారు.. ఇంతటితో ఆగదు.
- దేశంలోని అత్యంత రాజకీయ సంపన్నుడు చంద్రబాబు అని.. తెహల్కా చెప్పింది.
- రాజకీయ వ్యాపారవేత్త చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతా..?
- పేదల పక్షం ఉన్న.. విద్యార్థుల కోసం కృషి చేస్తున్న.. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పని చేస్తారా..?
- అట్టడుగు వర్గాల ఆత్మ విశ్వాసాన్ని పెంచిన.. నాయకుడు సీఎం జగన్.
- రామోజీ , చంద్రబాబుల దోపిడీని నేను అంగీకరించను..నా ఐడియాలజీ వారికి నచ్చదు.
ఆర్&బి అతిథి గృహంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కొందరి మహానుభావుల పేర్లు చెబుతున్నారు. శ్రీశ్రీ, వంగపండు, గిడుగు రామ్మూర్తి పంతులు, చాగంటి సోమయాజులు తదితరుల పేర్లు ప్రస్తావించారు. గొప్ప భావజాలాలు స్థిరీకరించి చదువుతున్న ఇటువంటి వ్యక్తులు ఎంత నిదానంగా ఎంత లక్ష్యంతో ఉంటారు. మీరు ఓ వైపు ఆ పుస్తకాలు చదివాను అంటున్నారు కానీ గొప్ప భావజాలాన్ని ఒంటపట్టించుకున్న విధంగా మాట్లాడడం లేదు. శ్రీశ్రీ ఏం చెప్పారు. పతితులారా భ్రష్టులారా బాధాసర్ప ద్రుష్టులారా ఏడవకండి ఏడవకండి..అని చెప్పారు. కన్నీళ్లతో నలిగిపోయిన వ్యథార్థుల గురించి చెప్పిన మాటలివి. మీరు వీటిని స్టడీ చేశారు. జగన్ అమలు చేస్తున్న పథకాలు ముఖ్యమంత్రి ఆలోచనలు. ఏంటవి ? ఆ పథకాలు ఎవరికి చేరుతున్నాయో చూడండి. ఎగ్జాట్లీ శ్రీశ్రీ చెప్పిన విధంగా బాధా తప్త హృదయాలతో ఉన్న వారికి గౌరవంగా అందించే పని చేస్తున్నారు. మీరు ఆయన్ను విమర్శిస్తు న్నారు. ఆయన పథకాలను విమర్శిస్తున్నారు. ఆ పుస్తకాలు చదివితే ఆ భావ జాలం ఏంటి ఇలాంటి లక్ష్యాలు చేరుకునేందుకు ఎలా ఉండాలి కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధంగా అనిపిస్తుంది. వంగపండు గారు..ఆయన కూడా చైతన్యం రగిలించే పాటలు అందించారు. మరి ఆ పాటలను పాడుతూ ఇక్కడ ఉన్న వారిని అజ్ఞానం కు ప్రేరేపించిన విధంగా మాట్లాడు తున్నారు. ఇంతకుముందు ఉద్దానం వెళ్లారు. కొన్ని విషయాలు చెప్పారు. మరి జగన్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పగలిగారా ?
భేష్ ఒక్క మంచి పని గురించి అయినా మీరు చెప్పగలిగారా ? తరువాత ఏమయినా సమస్య గురించి మాట్లాడగలిగితే చాలు.పుస్తకాలకు చెందిన భావజాలానికి అనుగుణంగా కాకుండా అందుకు భిన్నంగా మాట్లాడిన విధంగా కనిపిస్తోంది మీ వ్యవహారం.ప్రతి రోజూ వచ్చే టప్పుడు వచ్చే వార్తలు ఇప్పుడు వస్తున్నాయా . ఉపరితల జలాలు వంశధార నుంచి వారికి అందేవిధంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. అదేవిధంగా అందాక వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. వారి చికిత్స కోసం
పలాసలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి వస్తుంది. మధ్యలో ఓ ప్రభుత్వం వచ్చింది. వారేం చేశారా ?
ఇప్పుడు మరో సమస్యను సజెస్ట్ చేయండి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడపోక ముందు ఓ కమిటీని నియమించింది. శ్రీ కృష్ణ కమిషన్ ఏం చెప్పింది అన్నది మీరు ఎన్నడయినా చదివారా ? క్యాపిటల్ గురించి శివ రామ కృష్ణ కమిషన్ నివేదికను మీరు స్టడీ చేశారా ? ఏ కాంటెక్ట్స్‌లో రాష్ట్రం ఇమ్మన్నాను అంటే 65 సంవత్సరాల ఓ ప్రాంత ప్రజల నోరు నొక్కి ప్రభుత్వ ధనాన్ని ఓ ప్రాంతానికి కేటాయించి అభివృద్ధి చేస్తే, ఆ విధంగా చేసి కట్టు బట్టలతో రావాల్సి వచ్చింది. మళ్లీ అటువంటి సిట్యువేషన్ రాకుండా ఉండేందుకు నేను కాదు శ్రీ కృష్ణ కమిటీ కానీ శివ రామకృష్ణ కమిషన్ కానీ చెబుతున్నాయి. డీ సెంట్రలైజేషన్ గురించి చెబుతోంది.
అమరావతి కోసం మీరు పాటుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెబుతున్నారు. అది వద్దు పరిపాలన వికేంద్రీకరణ గురించి నా అభిప్రాయం చెప్పాను. ఇదే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పాలన రాజధానిగా విశాఖను చేయాలని నిర్ణయించింది. రాజాం వచ్చాక ఒకటే రాజధాని అని చంద్రబాబు అంటున్నారు. ఇది తగదు మళ్లీ ఓ యాభై ఏళ్లు మేం వెనక్కు పోవాల్సి వస్తుంది. ఆ విధంగా కాకుండా మాకు రాష్ట్రం ఇచ్చేయండి. మీరు అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే మేం యాభై ఏళ్లు వెనక్కు పోవడం ఖాయం. మా ప్రాంతానికి వచ్చి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓ ప్రాంత ప్రయోజనం కోసం నేను మాట్లాడుతున్నాను. కానీ అమరావతి అన్నది కొందరు క్యాపిటలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్నది . ఇది తిరుగుబాటు గడ్డ. ఆకలి, కన్నీళ్లు చూసిన గడ్డ. నేను మాట్లాడకపోయినా మిగతా వారెవ్వరయినా మాట్లాడతారు. ఈ కాంటెక్స్ట్ ను మీరు గుర్తించుకోవాలి. ప్రజలంతా యాక్సెప్ట్ చేసిన మోడల్ డీ సెంట్రలైజ్డ్ మోడల్. మీరు మళ్లీ ఒకే రాజధాని అని అమరావతి కోసం నిధులు వెచ్చిస్తాం అంటే మేం క్లైమ్ చేస్తాం. ఒక యాభై ఏళ్లు మళ్లీ వెనక్కు పోతాం. ఓ రాజకీయ పార్టీగా మా ఆవేదన ను అర్ధం చేసుకోండి. నిజాయితీ అయిన రాజకీయాలకు మద్దతు ఇవ్వండి అని కోరారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన ఎన్నికల్లో ప్రతిబింబించిన ఫలితాలు కూడా అదే ! మీరు ఆ విధంగా విన్నవించడం లో తప్పు లేదు. మీరు ఎవరితో కలిసి ప్రయాణించాలనుకుంటున్నారు. ఎవరి వైపు నిలబడి మీరు ఆ రిక్వెస్ట్ చేస్తున్నారు ? చంద్రబాబు గురించి మీకున్న అభిప్రాయం చెప్పండి. 19 ఏళ్ల కిందట ఆయన ఎలాంటి వారు అన్నది తెహల్కా డాట్ కామ్ చెప్పింది.
మీరు కూడా ఆయనతో కొన్నాళ్లు ప్రయాణించారు. మీకు కూడా ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఉత్తమ సాహిత్యం చదివేం అని చెప్పేవారు ఎంత నిదానంగా ఉండాలి. మీరు సహనంను కోల్పోయారు. ప్రసంగంలో భాగంగా ఇష్టాను సారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆ విధంగా మాట్లాడవచ్చా. కొద్ది మంది ధనవంతుల వైపు పనిచేసిన చంద్రబాబుకు మీరు మద్దతు ఇస్తున్నారు. కోట్లాది మంది పేదల కన్నీళ్లు తుడిచిన జగన్ కు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నా రు. ఇవాళ విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ఏంటన్నది చూడండి. అక్కడ నడుస్తున్న స్కూళ్లూ గమనించండి. విశాఖలో భూములు అమ్మేశారు. నేను సైనికుల భూమిని కబ్జా చేశాను అని అంటున్నారు. ఏమంటే ఈనాడు పేపర్లో రాశారు అంటారు. ఒక సైనికుడికి ఓ ఎసైన్డ్ భూమి ఇస్తే తరువాత పదేళ్ల తరువాత ఆ భూమి అమ్ముకోవచ్చు. ఎవ్వరైనా ఆ విధంగా చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రెవెన్యూ మినిస్టర్ కు భూములు కేటాయించే నిర్ణయాధికారం లేదు. ఏ సైనికుడి భూమిని ధర్మాన కబ్జా చేశారని చెప్పగలరా ?
రామోజీ చెబితే చెప్పేస్తారా చంద్రబాబు చెబితే చెప్పేస్తారా ? సమాజం కోసం గళమెత్తిన వారి గొంతులు నలిపేస్తాం అంటే ఒప్పుకోను. జగన్ అవినీతి పరుడు.. జైల్లో ఉన్నాడు అని కామెంట్లు చేశారు. ఏ వర్గాల వైపు ఆయన ఉన్నారో చూశారా ఎన్ని వర్గాల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారో చూశారా ? ఇవాళ విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు జగన్. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. పేదలకు అందే ప్రజా వైద్యం కోసం చేస్తున్న ప్రయత్నం చేయండి. మీరు టీడీపీకి మద్దతు ఇవ్వడం అన్నది మీ గౌరవాన్ని పెంచేదా ? ఓ కళాకారుడిగా మీరంటే మాకు గౌరవం ఉంది.
మీరు రాజకీయ పార్టీ పెట్టడంపై గౌరవం ఉంది. కానీ పార్టీ పెట్టి నడుచుకుంటున్న వైనం పై విభేదం ఉంది. మాట్లాడే ముందు ఓ వ్యక్తి పై ఆరోపణలు చేసే ముందు పొంతన లేని మాటలు చెప్పడం భావ్యం కాదు. మేం అమరావతిలో వ్యాపారం చేస్తామంటే ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటాం. ఎందుకు మరో యాభై ఏళ్లు మీరు రెవెన్యూ అంతా అక్కడే పెడతారు. అప్పుడు మళ్లీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల రాజకీయ ప్రయోజనాలు, వారి స్థితి గతులు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడతున్నాను. మీరు అంటే అమరావతే రాజధాని అంటే నేను తరువాత ఇదే విషయమై ప్రత్యేక రాష్ట్రం అన్న విషయమై నేను మాట్లాడతాను అని అంటున్నాను. ఇది నా ఒక్కడి వాయిస్ అంటున్నాను. ఇతర జిల్లాలతో సమానంగా శ్రీకాకుళం జిల్లా ఎదగాలి.
భావనపాడు కోసం ఇప్పటికే భూ సేకరణ చేశాం. అదేవిధంగా మరికొన్ని అభివృద్థి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. భూముల తాకట్టు పెట్టి ఏం చేశారు ? జగన్ మోహన్ రెడ్డి పట్టుకు పోయారా ? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడడం లేదు అని అంటున్నా రు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం పాలసీ. ఇప్పటికే కొన్ని సార్లు కేంద్ర పెద్దలను కలిసి విన్నవించి ఉన్నాం. కానీ ఆ పాలసీ విషయమై కేంద్రం ఓ స్పష్టమయిన వైఖరితో ఉంది. దీనిని నిలువరించే వీలు లేదన్న విధంగా ఇప్పటి పరిణామాలు ఉన్నాయి. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.