- కోనసీమలో కోడిపందాలపై ఎస్పీ ఇబ్బంది పెడుతున్నారు ఎమ్మెల్యే రాపాక
- కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు అన్నీ ఉంటాయి.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
- అమలాపురంలో మంత్రి విశ్వరూప్ తో ముగిసిన ఎమ్మెల్యేల సమావేశం..
కోనసీమలో కోడిపందాలు తరతరాలుగా వస్తున్న ఆచారం.కోనసీమలో కోడిపందాలు ఆడకుండా ఎస్పీ గారు ఇబ్బంది పెడుతున్నారు.ఒక్క కోనసీమలో తప్ప అన్నిచోట్ల జరుగుతున్నాయి.హైదరాబాద్ అంతా ఖాళీ చేసి సంక్రాంతి సంబరాలకు కోనసీమకు తరలివస్తున్నారు.ఈసారి కూడా కోనసీమలో కోడిపందాలు, గుండాటలు ఉంటాయి.ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.తరతరాలుగా వస్తున్న ఆచారాలు ఆపడానికి మనమెవరం.
ప్రజలు ఆనందంగా ఉండడం కోసం ఎటువంటి ఆంక్షలు ఉండవు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..
కోనసీమలో ఉన్న సాంప్రదాయలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.కోనసీమలో ఉన్న సాంప్రదాయాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుంది.సాంప్రదాయాలు ఏమున్నాయో అవన్నీ జరిగి తీరుతాయి ఎవరు అధైర్య పడొద్దు అన్ని జరిగి తీరుతాయి అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు.