Latest Posts

పేపర్ మిల్ కార్మికుల సమస్యలపై పరంపర ఆపాలి

 

  • పేపర్ మిల్ కార్మికుల సమస్యలపై పరంపర  ఆపాలని జిల్లా కలెక్టర్ తో, రాజనగరం  శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో చర్చించిన కార్మిక సంఘాల నేతలు

కాంట్రాక్ట్ కార్మికుల కడుపు కొట్టే కొంతమంది జేబులు నింపుకుంటున్న కలెక్షన్ల పరంపర టు ఆపాలని గుర్తింపు ఎన్నికలు వెంటనే జరగాలని తదితరు డిమాండ్స్ కోరుతూ రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 8 కార్మిక సంఘ నేతలు గురువారం జిల్లా కలెక్టర్ మాధవి లత గారితో సుమారు మూడు గంటలపాటు చర్చించడం జరిగింది.DCL,ఏసీఎల్ అధికారును కూడా పిలిపించి నిబంధనలు అడిగి తెలుసుకున్నారుఈ సందర్భంగా జక్కంపూడి రాజా ఆమెకు వివరిస్తూ 31 నెలలుగా పెండింగ్లో ఉన్న వేత్తల ఒప్పందం వెంటనే చేయాలని చట్ట వ్యతిరేక నిరంకుశ పద్ధతులకు పాల్పడుతున్న రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యం చర్యలను ఆపాలని గత మూడు సంవత్సరాలుగా లాభాలతో నడుస్తున్న పేపర్ మిల్లు కార్మికులకు వేతనాలు పెంచడంలో ఇబ్బందులు పెట్టడం చాలా దారుణం అన్నారు.

సిఐటియు ఉపాధ్యక్షులు యూనియన్ గౌర అధ్యక్షులు  టి అరుణ్ వివరిస్తూ పేపర్ మిల్లు యాజమాన్యం గత మూడు సంవత్సరాలుగా చేపడుతున్న నిరంకుశ విధానాలపై ఆమెకు వివరించారు కార్మిక నాయకుడు ముసుగులో కార్మికుల్ని కార్మిక హక్కుల్ని అమ్మేస్తున్న ప్రవీణ్ చౌదరి ఆగడాలపై సుదీర్ఘంగా వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలోనే ఎన్నడూ జరగని కలక్షన్ల పరంపర సాగిస్తున్న యాజమాన్య దుచ్చెర్లపై ఆమెకు వివరించారు

కార్మిక నేత రాజేష వివరిస్తూ క్యాంటీన్ రేట్లను తక్షణమే తగ్గించాలని ఎలవెన్సులు వెంటనే ఇవ్వాలని ఖాళీగా ఉన్న కోటర్స్ ను బాగు చేయించి తక్షణమే కార్మికులకు ఎలాట్మెంట్ చేయాలన్నారు

ఏఐటియుసి ఉపాధ్యక్షులు తాటిపాక మధు వివరిస్తూ మొత్తం పరిశ్రమంలో కోర్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పరిమినెంట్ చేయాలని నాన్ కోర్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులకు సీనియార్టీ ప్రకారంగా వైట్ కార్డులు ఇవ్వాలని కోరారు

ఐ ఎన్ టి యు సి ,ఎఫ్ ఐ టి యుకార్మిక నాయకుడు శ్రీనివాస్ ,ఏఐటీయూసీ నాయకుడు జిఏరామారావు ,టి ఎన్ టి యు సి నాయకుడు సుబ్బారావు వివరిస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు నెలసరిగా ప్రతి నేల ఐదో తేదీన ఇవ్వాలని మేనేజ్మెంట్ వారు అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించిన పర్మినెంట్ సెక్యూరిటీ కార్మికులను తక్షణమే వీధిలోకి తీసుకోవాలని తీసుకోవాలని వారు వివరించారు దీనికి బదులుగా కలెక్టర్ మాట్లాడుతూ మీ సమస్యలన్నీ నాకు అర్థం అయ్యాయని రేపు మేనేజ్మెంట్ తో మాట్లాడతానని ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు

పేపర్ మిల్

Latest Posts

Don't Miss