Latest Posts

అఖిల పక్షంలో బి ఆర్ ఎస్ జెండాని వ్యతిరేకిస్తాం-మేడా శ్రీనివాస్

 

అఖిల పక్షంలో బి ఆర్ ఎస్ జెండాని వ్యతిరేకిస్తాం-మేడా శ్రీనివాస : మేడా శ్రీనివాస్

రాజమండ్రిలో అఖిల పక్ష సమావేశంలో బి ఆర్ ఎస్ జెండా ఏమిటని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. గతంలో ఆంధ్రులను దూషించి, ఇప్పుడు తెలంగాణలో ఛీత్కారం పొంది, ఏపీలోకి బి ఆర్ ఎస్ పేరిట కేసీఆర్ అడుగుపెట్టడాన్ని ఎంతమాత్రం సహించబోమని ఆయన స్పష్టంచేశారు. ఇది కోవర్టు విధానమే అవుతుందన్నారు.ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ అఖిలపక్షంలో బి ఆర్ ఎస్ జెండాపై వివరణ ఇవ్వాలన్నారు. అఖిల పక్షంలో బి ఆర్ ఎస్ ని బహిష్కరించి, కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ ని మట్టికరిపించడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అలాంటప్పుడు ఏదో సాకుతో బి ఆర్ ఎస్ పేరిట ఆంధ్రాలో అడుగుపెట్టాలని చూస్తుంటే, ఆ జెండా మోయాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. ఇలా చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కాసాని రాజు, ఎవిఎల్ నరసింహమూర్తి, పెండ్యాల కామరాజు, డి వి రమణమూర్తి, కొత్తపల్లి భాస్కరరామ్, లంక దుర్గాప్రసాద్, సిమ్మా దుర్గారావు , బర్ల ప్రసాద్, డి. మిషాంత్, మట్టపర్తి తులసి, గుడ్ల సాయిప్రసాద్, ఆర్ కె చెట్టి, బసా సానియా, తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss