Latest Posts

సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమాన్ని మరచిపోయారు-కురగంటి సతీష్

 

సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమాన్ని మరచిపోయారు…

బిజెపి ఒబిసి మోర్చా జోనల్ ఇంచార్జ్ కురగంటి సతీష్ అధ్యక్షతన బిసి సంక్షేమ హాస్టళ్లలో లోపాలపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపిశ్రీనివాస్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణ రూరల్ మండల అధ్యక్షులు యానాపు ఏసు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఒబిసి మోర్చా తూర్పుగోదావరి జిల్లాలో బిసి సంక్షేమ వసతి గృహాలను గత రెండు రోజులుగా సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందని గతంలో ఎన్నో ఫిర్యాదులు చేసి ఉన్నాము అయినా ఏ విధమైన చర్యలు కనిపించలేదు అని. దీనిపై ఒబిసి మోర్చా నిరసన తెలియజేస్తుందని నిర్వహణ నిధులు ఇవ్వడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేదు. దీనిపై విద్యార్థులతో మాట్లాడటం అయ్యింది అని 52 వేల మంది బిసి విద్యార్ధుల సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరచిపోయిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1109 ప్రీ మెట్రిక్ , పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న 430 వార్డెన్ పోస్ట్ లు భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 52 వేల మంది విద్యార్థులు ఉన్న ఆ స్థాయిలో నిధులు ఇవ్వడం లేదు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిధులు మంజూరు చెయ్యాలి. వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారము , వసతులు కరువయ్యాయి. నాణ్యత లేని సరుకులు వినియోగం అగుచున్నదని నాలుగో తరగతి ఉద్యోగులు వంట మనిషి ,వాచ్ మెన్ పోస్టులు 1600 ఖాళీగా ఉన్నాయి అవి వెంటనే భర్తీ చేయాలి అని విద్యార్థుల ఆహారం , విద్య , హాజరు లో పర్యవేక్షణ లేకపోవడం వల్ల తగినంత ఫలితాలు రావటం లేదు. ఇది ఉన్నత అధికారుల నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యాన్ని విడనాడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిధులు నవరత్నాలకు మళ్లిస్తూ బిసి సంక్షేమ నిధులు కూడా దారి మళ్ళిస్తుంది. ఇది బిసి బిడ్డలను మోసం చేయడమే బిసి సంక్షేమ హాస్టళ్ల పై ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. వసతి గృహాలు తక్షణమే ఆధునీకరించాలి అని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మేము ఫిర్యాదు శాంతియుత నిరసన చేయు సమయాన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం.1 పేరుతో బెదిరింపులకు దిగుచున్నది ఇది అప్రజాస్వామికం. ఉద్యమాలపై ఉక్కు పాదంగా చీకటి జిఓగా జిఓనెం.1 అని ప్రజలు భావిస్తున్నారు. తక్షణమే రద్దు చెయ్యాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం పై అంశాలపై నిర్ణయాలు తీసుకుని స్పందించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉద్యోగులతో కలసి శాంతియుత ఉద్యమాన్ని ఒబిసి మోర్చా చేపడుతుందని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో ఎన్వీబియన్ ఆచారి , నాగార్జున, నాగభూషన్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss