Latest Posts

“డాక్టర్ వైయస్సార్ చిరునవ్వు” కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కాకాణి

 

“డాక్టర్ వైయస్సార్ చిరునవ్వు” కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కాకాణి.

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము- కోల్గేట్ కంపెనీ సంయుక్తంగా నెల్లూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన “డాక్టర్ వైయస్సార్ చిరునవ్వు” కార్యక్రమాన్ని పొదలకూరు జడ్పీ హైస్కూల్లో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజాన్ని తయారు చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు.
  •  విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ముఖ్యమంత్రి కల్పించారని, వారి ఆరోగ్యం విషయంలో కూడా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని పేర్కొన్న మంత్రి
  • విద్యార్థులు దంతాల సంరక్షణ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని, వారికి దంతాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తూ, చక్కటి చిరునవ్వులతో ఎటువంటి దంత సమస్యలు లేకుండా ఉంచడమే “డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు” కార్యక్రమం ముఖ్య ఉద్దేశనమని తెలిపిన మంత్రి.
  •  నెల్లూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన మంత్రి కాకాని.
  • "డాక్టర్ వైయస్సార్ చిరునవ్వు" కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కాకాణి

Latest Posts

Don't Miss