- దేశంలో 17 రైల్వేజోన్లు ఉన్నాయి. అందులో ఉత్తరభారతంలో 14 కాగా,దక్షిణాదిన 3 ఉన్నాయి. అవి చెన్నయ్, బెంగుళూరు ( హుబ్లీ), సికింద్రాబాద్ లు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించారు. అంటే సికింద్రాబాద్ జోన్లో లో 7 డివిజన్ లు ఉండగా అందులో 2003 లో గుంతకల్ డివిజన్ నుండి హుబ్లీ ని తొలగించి దాన్నే బెంగుళూరు స్థానంలో జోన్ గా చేశారు. సికింద్రాబాద్, హైదరాబాదు, నాందేడ్, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లు మిగిలాయి.ఇందులో ఇప్పుడు కోత్తగా పెట్టబోయే జోన్లో గుంతకల్, విజయవాడ, గుంటూరులు ఉంటాయి. వీటిని కాదని తూర్పతీర జోన్( భువనేశ్వర్) లోని విశాఖపట్నం (వాల్తేరు) డివిజన్ ని జోన్ చేస్తామనడం విడ్డూరం.ఉన్న వాటిలో గుంతకల్లు డివిజన్ పెద్దది, మధ్యలో అందరికీ సదుపాయంగాను ఉంటాది. హుబ్లీ స్థానంలో జోన్ అయ్యే అవకాశం కోల్పోయిన గుంతకల్ నే కొత్తజోన్ చేయాలి. ఎదో తిరకాసు పెట్టి అన్నీ విజయవాడ, గుంటూరు లకు తరలిస్తున్నట్లే తరలిస్తే రాయలసీమను దగాచేయడమే అవుతుంది. అన్నీ కోల్పోతున్న సీమవాసులు అవకాశమున్న రైల్వే జోన్ కోసమైనా కనీసం ఉద్యమించాలి. అని గుంతకల్ రైల్వేజోన్ సాధన సమితి వాపోయింది.