- ఆంధ్ర పేపర్ మిల్ కార్మికుల భవిష్యత్తుపై మా పోరాటం-ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
- యాజమాన్యం మొండి వైఖరి విడనాడే వరకు పోరాటం ఆగదు-కార్మిక నేత శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం.
- 24 తర్వాత ఎప్పుడైనా కార్మికుల సమ్మె-సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు
టి అరుణ్. - కార్మికుల సమస్యలపై 23న రాజమండ్రి బంద్
- ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు
ఆంధ్ర పేపర్ మిల్ కాంట్రాక్ట్ ,పర్మినెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పరంపర టూ ను రద్దు చేయాలని యాజమాన్యం మొండి వైఖరి నశించాలని కోరుతూ 8 కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఈ నెల రోజులపాటు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నట్లు యూనియన్ కార్మిక సంఘాలు ప్రకటించాయి .
ఈరోజు సాయంత్రం యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడం జరుగుతుంది రేపటినుండి రిలే దీక్షలు
14 రోజులుజరుగుతాయి
- 14న భోగిమంటలలో యాజమాన్యం ఇచ్చిన పరంపర టు జీవోను దగ్ధం చేయడం జరుగుతుంది.
- 13న అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుంది 15న పేపర్ మిల్లు వద్ద కార్మికులతో మనవహరం జరుగుతుంది.
- 18న పేపర్ మిల్ గేటు వద్ద జనరల్ బాడీ జరుగుతుంది.
- 20న నగరంలో అన్ని పార్టీలు కార్మిక సంఘాలతో భారీ ర్యాలీ జరుగుతుంది.
- 23న రాజమండ్రి బందు జరుగుతుంది.
- 24న తర్వాత ఎప్పుడైనా కార్మికుల సమ్మె జరుగుతుంది.