Latest Posts

చంద్రబాబు-పవన్‌కళ్యాణ్‌ భేటీపై పలువురు మంత్రుల స్పందన

 

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ భేటీపై పలువురు మంత్రుల స్పందన :

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మళ్లీ ముసుగు తొలగించారు.ఇద్దరూ తెలంగాణలో సమావేశమై ఏపీపై కుట్ర చేస్తున్నారు.వారు ముందు నుంచి కలిసే ఉన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు.వారిద్దరి భేటీ సాధారణమే. అందులో సంచలనం ఏమీ లేదు.సంక్రాంతి ప్యాకేజీ కోసమే పవన్, చంద్రబాబు ఇంటికి వెళ్లారు
పవన్‌ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టుపెట్డాడు.కాపులనూ మూకుమ్మడిగా తాకట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.పవన్‌ను నమ్ముకున్న జనసేన కార్యకర్తలకు దిక్కు తోచడం లేదు.ఎవరెన్ని కుట్రలు చేసినా, మళ్లీ మా విజయాన్ని ఎవరూ ఆపలేరు.పలురువు మంత్రుల స్పష్టీకరణ

ఇక ఏయే మంత్రి ఏం మాట్లాడారంటే..:

కారుమూరి నాగేశ్వరరావు. పౌర సరఫరాల శాఖ మంత్రి:

 • చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ కలయిక కొత్త ఏమీ కాదు. ఇద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉన్నారు..
 • రాష్ట్రం గురించి, ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు పట్టదు. వారిద్దరికీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం.
 • ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి అనేదే పవన్, చంద్రబాబు ప్లాన్‌
 • పవన్‌కళ్యాణ్‌కు పేద ప్రజల ప్రాణాలు కంటే చంద్రబాబుబే ముఖ్యం.
 • నాడు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్‌ కనీసం మాట్లాడలేదు.
 • మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సభల్లో కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు 11 మంది బలైనా పవన్‌ నోరెత్తలేదు.
 • కానీ ఇప్పుడు ఇద్దరూ తెలంగాణలో కలిశారు. ఏపీపై కుట్ర చేస్తున్నారు
 • పవన్‌ కళ్యాణ్‌కు తనను నమ్ముకున్న కార్యకర్తల కంటే కూడా చంద్రబాబే ముఖ్యం అని నిరూపించాడు.
 • ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు

గుడివాడ అమర్‌నాథ్‌. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి:

 • ప్యాకేజ్‌ స్టార్‌ పవన్‌ పండగ మామూలు కోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. ఇద్దరి భేటీ కొత్త కాదు.
 •  మంత్రులపై జన సైనికులు దాడి చేస్తే చంద్రబాబు పరామర్శిస్తారు.
 • చంద్రబాబు సభలో జనం చనిపోతే పవన్‌ కళ్యాణ్‌ పరామర్శకు వెళ్లరు.
 • వీరిద్దరూ జనాన్ని మోసగించడం పనిగా పెట్టుకున్నారు.
 • అమాయకపు జనసేన కార్యకర్తలను పవన్‌ అమ్మకానికి పెట్టారు.
 • పవన్‌ సీఎం అవుతారని జనసేన కార్యకర్తలు అంటారు. కానీ అది ఎలా సాధ్యం?
 • చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకులన్ని సీట్లతో పవన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ ఎలా చేరుకుంటారు?

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి:

 • చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ది అనైతిక పొత్తు.
 •  ఎవరైనా ఒక ప్రత్యేకమైన ఎజెండాతో రాజకీయాలు చేయాలి. కానీ వీళ్లది మిక్స్‌డ్‌ ఎజెండా. ప్రజలకు జరిగే మంచిని అడ్డుకోవడమే వారి ఎజెండా.
 •  చంద్రబాబు డైరెక్టర్‌ అయితే పవన్‌కళ్యాణ్‌ యాక్టర్‌ అని జగన్‌గారు ఎప్పుడో చెప్పారు.
 • ఈరోజు వారిద్దరి కలయిక ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉన్న అనుమానాలన్నీ తొలిగిపోయాయి.
 • బలం లేని వాడు పక్కనోడి బలాన్ని తీసుకుని తాను బలవంతుడిని అని చెప్పుకోవాలనే ప్రయత్నం బాబుది.
 • ప్రజలో మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. వారిక మోసపోరు.

అంబటి రాంబాబు. జల వనరుల శాఖ మంత్రి:

 • ‘మేం పరస్పర పరామర్శలు చేసుకుంటున్నాం’.. అని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ చెబుతున్నారు. అలా వారు ప్రజలను మోసం చేస్తున్నారు.
 •  సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తొలి నుంచి ఏం చెబుతున్నారో.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇవాళ అదే చేస్తున్నారు.
 • చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి పవన్‌కళ్యాణ్‌ సిద్ధంగా ఉన్నారు. ఇద్దరూ సీట్లు çసర్దుబాటు చేసుకోబోతున్నారు.
 • పదో పరకో తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చేసేందుకు పవన్‌కళ్యాణ్‌ సిద్ధంగా ఉన్నాడు.
 • పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి పావలాకో పదికో పరకకో లాలూచీ పడి ఈ రాష్ట్రంలో తనను నమ్ముకుని ఉన్న కాపు సామాజికవర్గ ఓటర్లందర్నీ గంపగుత్తగా చంద్రబాబుకు ఊడిగం చేయడానికి తీసుకెళ్తాడు తప్ప జరిగేది.. ఒరిగేదేమీ లేదు.
 • అయితే ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరయ్యా? అంటే, ‘మా పవన్‌కళ్యాణ్‌ సీఎం అవుతాడు’.. అని గొంతు చించుకుని అరిచే వాళ్లంతా ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించాలి.
 •  ‘అయ్యా.. మీరిద్దరూ కలిసి 2024లో కలిసి పోటీ చేస్తున్నారా? లేదా?. గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి? అని.. అయితే, అది జరిగేది.. చచ్చేది లేదనుకోండి.
 • ఏదో మీడియాలో పెద్ద కవరేజీ కోసం వారిద్దరి ఆరాటమే తప్ప, వారిద్దరి కలయికలో పెద్ద పస ఏమీ లేదు.
  వారిది చాలా సాధారణమైన భేటీ. తొలి నుంచి వారిద్దరూ కలిసే సంసారం చేస్తున్నారు.
 •  ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వాళ్లు పవన్‌కళ్యాణ్‌ మాతోనే ఉన్నాడని ఇప్పటిదాకా చెప్పారు. మరోవైపు పవన్‌కళ్యాణ్‌ కూడా బీజేపీతో మిత్రపక్షమని చెప్పాడు.
 • మరి, బీజేపీతో ఉండాల్సిన పవన్‌కళ్యాణ్‌ మరోవైపు చంద్రబాబుతో ఎందుకు ఉంటున్నాడు? ఇది నైతికమేనా?
 •  ఈ దేశంలో, రాష్ట్రంలోనూ అన్‌రిలయబుల్‌ పొలిటీషీయన్, నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది పవన్‌కళ్యాణ్‌ మాత్రమే.
 • బీజేపీతో విడాకులు కాకుండా చంద్రబాబుతో సంబంధానికి అర్థం ఏమిటి పవన్‌?. మీకసలు నైతిక విలువలు ఉన్నాయా?
 •  జనసేన అనేది ఒక అఫ్లియేటెట్‌ సంస్థ. అది కూడా చంద్రబాబుకి.
 •  చిరంజీవి అప్పుడు ఏకంగా తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు. అలాగే, పవన్‌కళ్యాణ్‌ను కూడా తన పార్టీని తెలుగుదేశం పార్టీలో కలిపేసెయ్యండి. ఎవరొద్దన్నారు?
 • ఇంకా ముసుగులో గుద్దులాటలెందుకు? డ్రామాలెందుకు? పరస్పర పరామర్శలెందుకు?. ఇంకా ఎవరిని మోసం చేయాలని?
 •  మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా, చేయాలనుకున్నా 2024లో మళ్లీ వైయస్సార్‌సీపీ విజయాన్ని మీరెవ్వరూ అడ్డుకోలేరు.

జోగి రమేష్‌. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి:

 • సంక్రాంతి ప్యాకేజీ కోసమే పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబు ఇంటికి వెళ్లాడు.
  నిజంగా బుద్ధున్నవాడైతే కందుకూరు, గుంటూరులో కలిసి 11 మంది చనిపోయారని.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తారు.
 • కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు ఇంటికి పరామర్శకు వెళ్లడం ఏమిటి?. వవన్‌కళ్యాణ్‌ అనే నాయకుడికి బుద్ధుందా..?
 •  చంద్రబాబుకు, పవన్‌కళ్యాణ్‌కు సిగ్గూశరం ఏనాడో పోయాయి. వాళ్లిద్దరూ నైతిక విలువలను ఏనాడో వదిలేశారు.
 • ‘నాకు ఎన్ని సీట్లు ఇస్తావు?. నాకు ఎంత ప్యాకేజీ ఇస్తావు? నేను ఏయే స్థానాల్లో అమ్ముడుపోవాలి?’. అని దత్తతండ్రిని అడగడానికి దత్తపుత్రుడు వెళ్లిన భేటీనే తప్ప, మరొకటి కాదు.
 •  ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా సంతోషంగా ఉంటే.. వవన్, చంద్రబాబు ఇద్దరూ చీకటి ఒప్పందాలతో ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలని కుయుక్తులు పన్నుతున్నారు.
 •  వీళిద్దరికి తోడు పచ్చమీడియా ఛానెళ్లు, పచ్చ పత్రికలు కలిసి కుట్ర చేస్తున్నాయి. వారెన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ మా పార్టీ విజయాన్ని ఆపలేరు.
 •  మొత్తం 175కు 175 సీట్లు గెల్చుకుంటాం.

Latest Posts

Don't Miss