సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీపి కబురును అందించాయి. రెండు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులను ప్రకటించాయి. తెలంగాణలో జనవరి 13 నుంచి 17 వరకు పాఠశాలలకు, జనవరి 13 నుంచి 17 వరకు కళశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ఇక ఈనెల 18న పాఠశాలలు, 16న కళశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపిందిపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది.జనవరి 11 నుంచి 16 వరకు పాఠశాలలకు, కళశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. కాగా, జనవరి 18 నుంచి పాఠశాలలు, కళశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.