బ్రహ్మాసముద్రం మండల పరిధిలో హగారి-వేదావతి నది కోతకు గురైన మార్గం మరో రెండు మూడు రోజుల్లో వాహనదారులకు అందుబాటులో రానుంది. నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన ఆధునికరణ పనులు యుద్ధ ప్రతిపదికిన రేంబవళ్ళు పని చేసి ఒక కొలిక్కి తీసుకువచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో వాహనదారులకు ఈ మార్గం గుండా ప్రయాణం కొనసాగించవచ్చు నని ఆ మండల వై వైఎస్సార్ నాయకులు నాగిరెడ్డిపల్లి రామాంజినేయులు తెలిపారు. ఫలితంగా బ్రహ్మసముద్రం -రాయదుర్గం రెండు నియోజకవర్గం ప్రజలకు రాకపోక కష్టాలు తీరానున్నాయి..