మూడు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు కోసం రూ.12కోట్లు మంజూరు చేసిన కేంద్రం-వంగా గీతావిశ్వనాథ్
కార్మికులు వారి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం కాకినాడలో నిర్మాణం అవుతున్న ఈ. ఎస్. ఐ హాస్పిటల్ లో అత్యాధునిక సాంకేతిక తో 3 ఆపరేషన్ థియేటర్లు, మెడికల్ గాస్ పైప్ లైన్ కోసం, స్టెరైల్ సిస్టం కోసం ఆపరేషన్ థియేటర్లు స్టెరైల్ సిస్టమ్ కోసం, లాండ్రీ పరికరములు, విద్యుత్ అంతరాయము వలన ఇబ్బంది లేకుండా వుండే మిషనరీ కోసం, నాన్ మెడికల్ ఫర్నీచర్ మరియు ఇతర పరికరములు కోసం హాస్పిటల్ నిర్వహణ మరియు సత్వర వైద్యసదుపాయం అందిచుటకు కేంద్ర కార్మిక శాఖ రూ.12కోట్లు మంజూరు చేయడం జరిగింది. త్వరిత గతిన టెండర్ పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.