Latest Posts

కుప్పం ఘటనలపై డీజీపీ కి లేఖరాసిన చంద్రబాబు

 

కుప్పం ఘటనలపై డీజీపీ కి లేఖరాసిన చంద్రబాబు..

 • కుప్పం నియోజవర్గ మూడు రోజుల పర్యటనలో మొదటి రోజు నెలకొన్న, అంశాలపై డిజిపి కి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం లేఖ రాశారు.
 • కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చామన్నారు.
 • ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామసభలు నిర్వహించుకుంటామని స్పష్టంగా చెప్పామన్నారు.
 • కుప్పం పర్యటనలో పోలీసులు పలుమార్లు ఆటంకం కలిగించారు. పర్యటనలో వినియోగించే వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారన్నారు.
 • శాంతిపురం మండలం పెద్దూరుకు వచ్చిన తనపై పోలీసు బలగాలతో అడ్డుకొన్నారు.
 • పర్యటన అడ్డుకొని శాసనసభ్యుడిగా నాకున్న ప్రాథమిక హక్కులను కాల రాసారని లేఖలు స్పష్టం చేశారు.
 • నా పర్యటనకు భద్రత కల్పించడంలో జిల్లా ఎస్పీ విఫలమయ్యారన్నారు.
 • నాకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలపై లాఠీలతో దాడి చేశారు. లాటిట్లతో కొట్టడమే కాక కార్యకర్తలపై క్రిమినల్ కేసులు పెట్టారు.
 • గుర్తింపు కార్డులు లేకుండా పోలీస్ యూనిఫాంతో నా పర్యటనలో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారు.
 • పలమనేరు డీఎస్పీ పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిజిపి కి లేఖలో పొందుపరిచారు..
 • శుక్రవారం గుడిపల్లి మండలంలో జరిగే పర్యటనలు ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు డిజిపి కి లేఖ రాశారు.
 • డిజిపికి ఫిర్యాదు లేఖలో శుక్రవారం పర్యటన షెడ్యూల్ను జత చేసి పంపారు.

Latest Posts

Don't Miss