సి.ఎం.జగన్ నిర్ణయాలకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు…
రోడ్ల పై బహిరంగ సభల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది.దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.కానీ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ నిర్ణయాన్ని సమర్ధించారు.ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు.రోడ్ల పైన బహిరంగంగా సభలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిర్ణయం తప్పనిసరని పేర్కొన్నారు.ముందస్తుగా అనుమతి కోరితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖ అనుమతి ఇవ్వటంతో పాటుగా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు.ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు చేయటం అధికారుల బాధ్యతగా పేర్కొన్నారు.ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.