Latest Posts

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం సిపిఐ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి-అక్కినేని వనజ

 

  • వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం సిపిఐ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి -సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ
  • 17 నుండి 30 వరకు జగన్ అన్న ఇళ్ల లబ్ధిదారులు వద్దకు సిపిఐ ప్రచార కార్యక్రమం – జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

సిపిఐ జిల్లా జనరల్ బాడీ లో భవిష్యత్తు నిర్ణయాలు ఖరారు

ప్రజా కంటక పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం సిపిఐ శ్రేణులు సైనికుల పనిచేయాలని ప్రజల వద్దకు వెళ్లి జగన్ దురాగతాలను వివరించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు నేడు సిపిఐ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా జనరల్ బాడీ సమావేశం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం కన్నా వైసిపి ప్రభుత్వం దారుణంగా ఉందని అన్నారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య మానవ హక్కులు హరించబడుతున్నాయన్నారు ప్రశ్నించే వాడిని వివిధ రూపాల్లో అక్రమ కేసులు పెట్టి భయాందోళన గురి చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో ఏ వర్గం ఆనందంగా లేరని దళిత మైనార్టీ గిరిజన వర్గాలపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయన్నారు ఏపీ ప్రత్యేక హోదా విభజన చట్ట హామీల అమలు సాధన కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జనవరి 2 నుండి ఫిబ్రవరి 4 వరకు జరిగే బస్సు యాత్రకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనవరి 23 24 తేదీలలో ప్రజా సంఘాలతో కలిపి రెవెన్యూ డివిజన్లో వద్ద ఆందోళన చేస్తామని ఆమె అన్నారు.సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ జగనన్న ఇల్లు లబ్ధిదారులు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు కేరళ తెలంగాణఒరిస్సా రాష్ట్రాల్లో నూతన ఇల్లు నిర్మాణాలకు నాలుగు లక్షల వరకు పైన సాయం చేస్తున్నారని జన ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని మధు కోరారు దీనికోసం కార్యచరణ రూపొందిస్తున్నామని అన్నారు.ఇంకా ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు,సహాయ కార్యదర్శి సప్ప రమణ,పార్టీ సీనియర్ నాయకురాలు ఎడ్ల లక్ష్మి,పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కే జ్యోతి రాజు,సత్యనారాయణ,సిహెచ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం సిపిఐ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి-అక్కినేని వనజ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం సిపిఐ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి-అక్కినేని వనజ

Latest Posts

Don't Miss