Latest Posts

పోలీసుగా నటించి బంగారం దొంగిలించిన వ్యక్తిని పట్టుకున్న ప్రకాశం పోలీసులు

 

పోలీసుగా నటించి నగలు వ్యాపారి వద్ద బంగారం దొంగిలించిన వ్యక్తిని పట్టుకున్న ప్రకాశం పోలీసులు

  • 351 గ్రాముల బంగారు రికవరీ చేసిన పోలీసులు
  • నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్ గారు
  • ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోని క్రైమ్ నెంబర్:308/2022 U/s 420, 419, 406 IPC
  • నేరం జరిగిన తేది:21.09.2022 at12.00 hours near Cargo Parcel Officer, RTC బస్ స్టాండ్, ఒంగోలు. ఫిర్యాది తేది:21.09.2022 at 17.00 hours.
  • ఫిర్యాదుదారుడు: R.D.బాలాజీ S/o R.దండపాణి, age 51 years, R/o 54 (A), KC తొట్టం, కొంగుమహల్ దగ్గర, శెట్టి స్ట్రీట్,కోయంబత్తూరు, తమిళనాడు.
  • ముద్దాయిపేరు: షేక్ హుస్సేన్ బాషా S/o సత్తార్, వయస్సు 34 సంవత్సరాలు, లారీ క్లీనర్, వీరప్ప దేవాలయం వెనుక నివాసం, మురుగన్ టైర్ ఫ్యాక్టరీ సమీపంలో అనంతపురం జిల్లా గుంతకల్ (A-1) మరియు (మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.)
  • చోరీ సొత్తు విలువ: బంగారు ఆభరణాలు 460.840 గ్రాములు వాటి విలువ సుమారు రూ.22,00,000/-
  • రికవరీ చేసిన సొత్తు: దాదాపు 351 గ్రాముల బంగారు ఆభరణాలు వాటి విలువ మొత్తం విలువ రూ.17,00,000/-
  • అరెస్ట్ చేసిన ప్రదేశం& తేదీ: 04.01.2023 at RTC బస్ స్టాండ్, ఒంగోలు.

ఫిర్యాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో “విశాల్ జ్యువెలర్స్ వర్క్ షాప్”నిర్వహిస్తున్నారు. ఆర్డర్లపై బంగారు ఆభరణాలు తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీమకుర్తిలోని బంగారు దుకాణాలకు డెలివరీ చేసేవాడు. ఆ విధంగా తేదీ. 21.09.2022 ఉదయం 04.00 గంటలకు, బంగారు ఆభరణాలను అందించడానికి ఒంగోలులో “శబరి ఎక్స్‌ప్రెస్” దిగాడు. ఒంగోలులో ఆభరణాల డెలివరీ పని పూర్తయిన తర్వాత, అతను ఒంగోలు గాంధీ రోడ్‌లో ఆటో రిక్షా ఎక్కి, మిగిలిన బంగారు ఆభరణాలను డెలివరీ చేయడానికి ఆర్టీసీ బస్సులో చీమకుర్తికి వెళ్లడానికి ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మధ్యాహ్నం 12.00 గంటలకు ఆటో దిగాడు. అతను RTC బస్టాండ్‌లోకి నడుచుకుంటూ “కార్గో పార్శిల్ ఆఫీస్” దగ్గరకు చేరుకోగానే, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదుదారుని ఆపి యూనిఫాం లేకుండా”పోలీసు అధికారి” అని చెప్పి అతను గంజాయిని తీసుకెళ్తున్నాడన్న సమాచారం తమకు అందిందని, అతని బ్యాగ్‌ని తనిఖీ చేయాలని చెప్పి సివిల్ డ్రెస్‌లో ఉన్న మరొక వ్యక్తి వద్దకు అతన్ని తీసుకెళ్లారు. వారు నిజమైన పోలీసులే అని ఫిర్యాదుదారుడు నమ్మి బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ని వారికి అప్పగించాడు. పై నిందితులు తనిఖీ అనంతరం బ్యాగ్‌ను ఫిర్యాదుదారుడికి తిరిగి ఇచ్చి అతన్ని ఆర్టీసీ బస్టాండ్ వైపునకు తీసుకెళ్లి అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఫిర్యాదుదారుడికి అనుమానం వచ్చి బస్టాండ్ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్న వెంటనే అతని బ్యాగ్‌ని తనిఖీ చేయగా అతని బ్యాగ్‌లో బంగారు ఆభరణాలు కనిపించలేదు, మొత్తం 460.840 గ్రాముల బంగారు ఆభరణాలు మిస్ అయ్యినాయి.

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆధ్వర్యంలో ఒంగోలు I టౌన్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది ఒంగోలు ఆర్‌టిసి బస్టాండ్‌కు చేరుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి రూ.17,00,000/-విలువ గల 351 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన నిందితుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు.అతను మరో ఇద్దరితో కలిసి ఒంగోలు రైల్వే స్టేషన్ నుండి ఫిర్యాదుదారుని ఫాలో అయ్యి , గంజాయి కోసం పోలీసుల ముసుగులో అతని దృష్టిని మరలించి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. అనంతరం గుంతకల్లు వెళ్లారు. తేది.04.01.2023 అరెస్టయిన నిందితుడు విజయవాడలో ఆభరణాలను విక్రయించేందుకు ఒంగోలు RTC బస్ స్టాండ్ వచ్చి విజయవాడ బస్సు కోసం వేచి ఉండగా పోలీసులు అరెస్ట్ చేసినారు.కేసులో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ కేసును ఛేదించి నిందితున్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ SP (క్రైమ్) SV. శ్రీధర్ రావు, ఒంగోలు DSP U. నాగరాజు, ఒంగోలు 1 టౌన్ CI వెంకటేశ్వర్లు, SI యు.వి.కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుళ్లు M.సాయి కృష్ణ, G. విజయ్, ఖాజావలి, కానిస్టేబుళ్లు M.తిరుపతయ్య మరియు M. అనిల్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

పోలీసుగా నటించి బంగారం దొంగిలించిన వ్యక్తిని పట్టుకున్న ప్రకాశం పోలీసులు పోలీసుగా నటించి బంగారం దొంగిలించిన వ్యక్తిని పట్టుకున్న ప్రకాశం పోలీసులు పోలీసుగా నటించి బంగారం దొంగిలించిన వ్యక్తిని పట్టుకున్న ప్రకాశం పోలీసులు

Latest Posts

Don't Miss