‘గడప గడపకు మన ప్రభుత్వం’ సందర్భంగా టీడీపీ నాయకులు వైస్సార్సీపీలో చేరిక
కూడేరు మండలంలోని కొర్రకోడు గ్రామంలో గురువారం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు వై. విశ్వేశ్వరరెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పలువురు టిడిపి నాయకులు వైస్సార్సీపీ లోకి చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా పార్టీ లోకి చేరిన వారు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వివక్షత లేకుండా అన్ని వర్గాలకు సమానంగా పథకాలు అందించడంతో పాటు, సచివాలయాల ద్వారా గడప గడపకు సేవలు అందిస్తున్నారని అందులో భాగంగా తాము ఆకర్షితులై పార్టీలో చేరామని తెలిపారు. వైస్సార్సీపీలో చేరిన వారిలో హుసేనప్ప, హుసేనమ్మ, కుల్సిమ్ భీ, సిద్దమ్మ, దూదేకుల పకృద్దీన్ తదితరులు వున్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.