Latest Posts

కొత్త పెన్షన్ లబ్ధిదారుల పించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే DNR

 

కొత్త పెన్షన్ లబ్ధిదారుల పించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే DNR…

మీరు బాగుంటే నేను బాగుంటానని..మీ అందరి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే తన తపన అని..మీ అందరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అని తన సందేశం ద్వారా తెలిపిన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న కు మనం అంతా రుణపడి ఉన్నామని..వారికి మనందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుదాం అని కొత్త పెన్షన్ లబ్ధిదారులను ఉద్దేశించి కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR)అన్నారు.ఈ ఉదయం మండవల్లి మండలంలో నూతనంగా వివిధ రకాల పెన్షన్లు మంజూరు పొందిన 265 మందికి పెంచిన పించన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే DNR ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వారు మీకు పంపించిన సందేశం విన్నాక వారికి మీ పట్ల గల ప్రేమ సుస్పష్టం అవుతుందని అన్నారు.గత ప్రభుత్వం సంవత్సరానికి పెన్షన్ల కోసం 4978 కోట్లు ఖర్చు పెట్టడం గగనం అయ్యిందని..ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని నాలుగున్నర రెట్లు పెంచి రూ.19,500 కోట్లు ఖర్చును సునాయాసంగా చేస్తుందని అన్నారు.అర్హతే ప్రమాణంగా అందరికీ పెన్షన్లు ఇస్తున్న ఘనత మన ప్రభుత్వానిదే నని అన్నారు.మనసున్న మారాజును మీ గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నారు.మండల పరిషత్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గా ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముంగర విజయనిర్మల,మండల వైకాపా అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర రావు, సీనియర్ నాయకులు చేబోయిన వీర్రాజు ప్రసంగించగా.. మండల వైస్ ఎంపిపి అగస్తి ఆదివిష్ణు, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షురాలు జంగం వరలక్ష్మి, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బేతపూడి యేశావు రాజు,మండవల్లి గ్రామ సర్పంచ్ మెండా జాన్సీ,ఎంపీటీసీ సభ్యురాలు గూడపాటి జాన్సీ, మండవల్లి పిఏసీఎస్ అధ్యక్షులు బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్,మండవల్లి మల్లేశ్వరస్వామి గుడి ఛైర్మన్ కొల్లా కృష్ణ, సర్పంచ్ లు నేతల నాగరాజు,నాగదాసి థామస్,బోనం శేషగిరి, ఘంటసాల రత్నకుమారి,సైదు ఎస్తేరురాణి, యడాల నాగేశ్వరరావు, ఎంపిటిసిలు చిన్ని శ్రీకృష్ణ యాదవ్,పెరుమాళ్ళ లక్ష్మీకాంతం, నాగదాసి కిరీటి రాజు,దారా రమేష్,మండల కో ఆప్షన్ సభ్యులు దత్తాడ డేవిడ్,సింగనపూడి పిఏసీఎస్ అధ్యక్షులు బొమ్మనబోయిన వరప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బావిశెట్టి స్వామి, నాయకులు గుడివాడ వీరరాఘవయ్య,ముంగర మల్లికార్జున రావు,పుట్టి సత్యనారాయణ, బలే నాగరాజు,జయమంగళ వీర్రాజు,సైదు చంద్రరావు,చేబ్రోలు మాసిలమణి, ముత్యాల రాజు,మెండా సురేష్,పెరుమాళ్ళ పెద వెంకటేశ్వర రెడ్డి,దూసనపూడి నాంచారయ్య, జొన్నలగడ్డ నాగరాజు, మొగనాటి ఆనంద్,పద్మారావు, ఎంపీడీఓ మల్లీశ్వరి, ఎమ్మార్వో జనార్దన్,ఈఓఆర్డీ ఇంచార్జ్ రాధిక,పంచాయతీ కార్యదర్సులు తోట శ్రీనివాసరావు, ప్రభాకర్,కొండలు,దయామణి,సచివాలయాల కన్వీనర్లు, సచివాలయాల వెల్ ఫేర్ అసిస్టెంట్లు,వాలంటీర్లు, పెన్షన్ దారులు పాల్గొన్నారు.

కొత్త పెన్షన్ లబ్ధిదారుల పించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే DNR కొత్త పెన్షన్ లబ్ధిదారుల పించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే DNR

Latest Posts

Don't Miss