Latest Posts

ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడమే మన ప్రభుత్వం ధ్యెయం-దూలం నాగేశ్వరరావు

 

అర్హులై ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి.. ఇళ్లను నిర్మించుకోవడానికి ఒక్కో ఇంటికి 1,80,000 ప్రభుత్వం అందిస్తుందని.. మీకోసం ఇంత చేస్తున్న ప్రభుత్వ అధినేత జగనన్న కలను సాకారం చేయాలంటే.. మీరంతా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) ఇళ్ల లబ్ధిదారులను ఉద్దేశించి అన్నారు. ఈ ఉదయం కైకలూరులోని వైయస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ నందు ఇళ్ల పట్టాలను పొంది ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారులతో, వాలంటీర్లతో, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆశీస్సులతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అతి పెద్దదైన 94.5 ఎకరాలు సువిశాలమైన లేఔట్ తయారుచేసి.. ఆరడుగుల మేర మెరక చేయించి.. 2989 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.మొదటి విడతలో 1478 ఇళ్ళు మంజూరు అయ్యాయని అన్నారు.మొత్తం ఈ లే అవుట్ కోసం ప్రభుత్వం 168.24 కోట్లు ఖర్చుచేస్తుందని అన్నారు.మీకోసం ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వం ఇంత చేస్తుంటే ఇంకా కొందరు గృహానిర్మాణాలు మొదలుపెట్టకపోవడం శోచనీయం అన్నారు.వెంటనే గృహ నిర్మాణాలు మొదలు పెట్టి ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని..లేని పక్షంలో ముందుగా కట్టు కోవడానికి ముందుకు వచ్చే వారికి అవకాశం ఇచ్చిన వారవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి అడివి వెంకట కృష్ణమోహన్, వైస్ ఎంపీపీ మహమ్మద్ జహీర్ గ్రామ సర్పంచ్ డిఎం నవరత్న కుమారి ఎమ్మార్వో మురళీకృష్ణ ఎంపీడీవో రామలింగేశ్వరరావు టౌన్ సిఐ నాగరాజు ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో శరన్ హౌసింగ్ ఏఈ శేఖర్ నాయకులు అబ్దుల్ హమీద్ తోట మహేష్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గ్రామ వాలంటీర్లు ఇళ్ళ లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడమే మన ప్రభుత్వం ధ్యెయం-దూలం నాగేశ్వరరావు ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడమే మన ప్రభుత్వం ధ్యెయం-దూలం నాగేశ్వరరావు ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడమే మన ప్రభుత్వం ధ్యెయం-దూలం నాగేశ్వరరావు

Latest Posts

Don't Miss