Latest Posts

మనుషుల కతనే మార్చేసిన సాంకేతికత

 

సాంకేతికత.. మనుషుల కతనే మార్చేసింది.
వాళ్లు మనల్ని చూస్తే పిచ్చోళ్లు అనుకోవడం ఖాయం…

ప్రపంచంలో తలకాయలన్నీ ఏం చేస్తున్నాయో తెలీదు గాని.. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో
తలకాయలన్నీ వాలిపోతున్నాయి. వుహ తెలీయని చిన్నారుల నుంచి చదువు కుంటున్న
పిల్లల వరకు వంట చేస్తూ బిజీగా వుండే గృహిణుల నుంచి మూలకు చేరిన భామ వరకు
అంతా స్మార్ట్ ఫోన్ పట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగమైపోయింది.
దీనిని అభివృద్ధి అనాలా.. మన దౌర్భాగ్యం అనాలా అర్ధం కాని పరిస్థితి. సమయానికి బోజనం
పెట్టకపోయినా ఎవరితో చెప్పుకోలేని బార్య బాధితుడు.. ఫోన్ ముట్టుకోవద్దని చెప్పినా వినిపించుకోని పిల్లలు
పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోయే టీచర్లు.. వాట్సప్, వీడియో కాల్స్ తో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి వారు బిజి అయిపోయారు. అన్నింటికి సర్దుకుపోతూ జీవితం కొనసాగించే బాధ్యతగల పౌరులు. ఒక్కసారి వందేళ్ల క్రితం మనుషులు గాని మళ్లీ మన ముందుకు వచ్చి చూస్తే ఇప్పటి మనుషులను.. ఎలా చూస్తారో ఒక్కసారి ఆలోచించండి.వాళ్లు మనల్ని పిచ్చోళ్లు అనుకోవడం ఖాయం.. మనల్ని చూస్తే వాళ్లకి పిచ్చిరావడం ఖాయం.

Latest Posts

Don't Miss