Latest Posts

కాతేరులో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం

 

ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం:

భారతీయ జనతాపార్టీ ,ఓబీసీ మోర్చా రూరల్ మండల అధ్యక్షులు డా.చప్పిటి మూర్తి అధ్యక్షతన   కాతేరులో ఘనంగా జరిగిన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం…

భారతీయ జనతాపార్టీ రాజమండ్రి, ఓబీసీ మోర్చా రూరల్ మండల అధ్యక్షులు డా.చప్పిటి మూర్తి అధ్యక్షతన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం కాతేరు బిసి కోలనిలో జరిగింది. రాష్ట్ర ఒబిసి మోర్చా అధ్యక్షులు రొంగల గోపిశ్రీనివాస్ , బిజెపి మండల అధ్యక్షులు యానాపు ఏసు ముఖ్య అతిధులుగా పాల్గొని సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి గా ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని జ్యోతీరావ్ ఫులే భార్యగా కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని ఆమె విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారని. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేశారని ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలయ్యారని భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారని సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి అని కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు.1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళా ఉపాద్యాయురాలు దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు అని. సామాజిక విప్లవకారిణిగా స్ర్తీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారని సమాజంలో “సత్యాన్ని” శోధించడానికి 1873 లో భర్త జ్యోతిరావు ఫూలే తో కలసి “సత్యశోధక్ సమాజ్ “ను ప్రారంభించి బాల్యవివాహలకు వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు బలమైన ఉధ్యమం నడిపారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డా.భీమవరపు సూరిబాబు సిద్దాని వెంకట్ , బండారు అప్పారావు , కిల్లా రాజు పెండ్యాల నాగేశ్వరరావు కాతేరు గ్రామ జ్యోతిరావు ఫూలే సంఘ పెద్దలు పాల్గొని వారి అశయలక్ష్యాలలో అందరు నడవాలని అన్నారు.

Latest Posts

Don't Miss