Latest Posts

సంక్షేమాభివృద్ధిపై చర్చకు సిద్ధం-నదీం అహ్మద్

 

సంక్షేమాభివృద్ధిపై చర్చకు సిద్ధం-రాష్ట్ర ఉర్దూ అకాడమి ఛైర్మెన్ నదీం అహ్మద్

‘కొంత మంది నిరాశావాదులు, పేదల వ్యతిరేకులు.. రాష్ట్రంలో అభివృద్ధి లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారందరికీ నా చాలెంజ్‌.. నా వెంట రండి.. సంక్షేమాభివృద్ధి ఏ విధంగా జరిగిందో చూపిస్తా. లేదంటే.. మీరు చెప్పిన ఊరికే వెళదాం. అదే ఊళ్లోనే ఈ మూడున్నరేళ్లుగా ఏ విధంగా సంక్షేమాభివృద్ధి జరిగిందో చూపిస్తా. చంద్రబాబుకు, ఆయన్ను గుడ్డిగా అనుసరిస్తున్న ఎల్లో గ్యాంగ్‌కు ఇదే నా సవాల్‌.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మూడున్నరేళ్లుగా ఎన్నో సంక్షేమాభివృద్ధి పథకాలు చేపట్టారు. విప్లవాత్మక రీతిలో పలు రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణల ఫలితాలు అందరికీ కనిపించాలంతే కొంత సమయం పడుతుంది. ఈ విషయం తెలిసీ కూడా విష ప్రచారం చేస్తుండటం దుర్మార్గం. ఆ సంస్కరణల ఫలితంగానే ఇవాళ పేదోడి ఇంట్లో కూడా ఓ ఇంజినీర్‌ తయారవుతున్నాడన్న సత్యం మన కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతి ఇంట్లోనూ ఎంబీఏ, ఎంసీఏ, ఇతర డిగ్రీలు చదువుతున్న పిల్లలు కనిపిస్తున్నారు. వారంతా మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకునేందుకు నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దే.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పేదల ఉన్నత చదువులకు ఒక అడుగు ముందుకు వేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పది అడుగులు ముందుకు వేస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేదలకు అన్ని విధాల్లా అండగా నిలుస్తున్నారు. అందువల్లే ఈ రోజు లక్షలాది మంది పిల్లలు బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంబిబిఎస్‌ పూర్తి చేసి తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు.ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రతి ఇంటిలో ఎల్కేజీ నుండి పీజీ వరకు పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకుంటున్నారు. కూలి పనిచేసే వారు, చిరు వ్యాపారులు, రెక్కాడితో కానీ డొక్కాడని వారు సైతం ఇవాళ పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నారంటే అది సీఎం వైఎస్‌ జగన్‌ ఘనతే కారణం. అలాంటి ఇళ్లలోని పిల్లలు పెద్ద చదువులు చదువుకుని నెలకు లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు.. ఎదుగుతున్నారు.చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం తెలుగు ప్రజలు ఖర్మే. ఆయన చేసిందేమీ లేదు. ప్రచార పిచ్చితో ప్రజలను మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచార పిచ్చితో 29 మంది మృతికి కారణమైన చంద్రబాబు.. మొన్నటికి మొన్న కందుకూరులో 8 మంది, నిన్న గుంటూరులో ముగ్గురి దుర్మరణానికి కారణమయ్యారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టి.. డ్రోన్‌ ఫొటోలతో ఎక్కువ మంది వచ్చినట్లు చూపించుకోవడంలో భాగంగా ఇలా పేదల ప్రణాల్ని బలిగొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ గారు 32 లక్షల మంది పేదలకు ఏ ఇబ్బంది లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే.. చంద్రబాబు 30 వేల మందికి సరుకులు పంపిణీ చేయలేక పోయారు. అవీ నాశిరకం సరుకులు. పది వేల మందికి సరిపడా టోకెన్లు ఇచ్చి.. 30 వేల మందిని రప్పించి.. మూడు నిండు ప్రాణాలను బలిగొనడం దుర్మార్గం.

రాష్ట్రంలో ఉర్దూ అకాడమీ గురించి చెప్పాలంటే వైఎస్‌ జగన్‌కు ముందు.. ఆ తర్వాత అని చెప్పుకోవాలి. ఉర్దూ లాంగ్వేజ్‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సెకండ్‌ అఫీషియల్‌ లాంగ్వేజ్‌గా ప్రకటించారు. తద్వారా ఉర్దూ నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి.ఉర్దూ అకాడమీలో గత ప్రభుత్వాల హయాంలో అడ్డగోలుగా 167 మందిని నియమిస్తే.. ఇవాళ వారందరికీ ఉద్యోగ భద్రత కరువైందని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన మానవత్వంతో వారందరికీ కన్సాలిడేటెడ్‌ పే కింద నియామక ఆర్డర్లు ఇప్పించారు. తనది మానవత్వం ఉన్న ప్రభుత్వం అని జగన్‌ గారు నిరూపించుకున్నారు. పార్టీలు చూడం, కులం చూడం, మతం చూడం, ఓటు వేశారా లేదా చూడం అని చెప్పిన దాన్ని ఆచరణలో చూపించారనేందుకు ఇది కూడా ఒక నిదర్శనం. ఉర్దూ అకాడమీకి డైరెక్టర్‌/సెక్రటరీగా ఉర్దూలో ప్రావీణ్యత ఉన్న వారిని కేటాయించి.. అకాడమీ అభివృద్ధికి బాటలు వేశారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉర్దూ అకాడమీని భ్రష్టు పట్టించారు. అవినీతి, అవకతవకలతో అప్రతిష్టపాలు చేశారు. వాటన్నింటినీ సరిచేస్తూ ఇవాళ అకాడమీని సక్రమమైన మార్గంలో ముందుకు తీసుకుపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవకతవకలపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. అకాడమీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా పలు సెమినార్లు నిర్వహించాం. ఉర్దూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. త్వరలో ముఖ్యమంత్రి గారి సూచనలు, ఆదేశాల మేరకు మరిన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం.సీఎం వైఎస్‌ జగన్‌ పాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారం మినహా రాష్ట్రం సుభిక్షంగా ఉంది.

Latest Posts

Don't Miss