Latest Posts

రాజమండ్రి సభలో సీఎం జగన్ ప్రసంగం

 

రాజమండ్రి సభలో సీఎం జగన్ ప్రసంగం:

  • పెన్షన్ సొమ్మును పెంచుకుంటూ పోతామని చెప్పిన మాటను నిలబెట్టుకుని నెలకు రూ.2,750 కి పెంచాం.వితంతువులకు,అవ్వా తాతలకు,చేనేతలకు,మత్స్యకారులకు,ఒంటరి మహిళలకు,ఎయిడ్స్ వ్యాధిగ్రస్దులకూ ఇలా 64 లక్షల మందికి ఈ పించన్ పెంపు వర్తిస్తుంది.పుట్టుకతో అంగవైకల్యానికి గురయినవారికి,దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాదులున్నవారికి,డయాలసిస్ పేషెంట్లకు,ఇలా నిరుపేదలందరికీ పెన్షన్లు ఇస్తున్నాం.దేశం లో ఎక్కడా లేని విదంగా పెన్షన్ సొమ్మును 2,750 నుండి ఏకంగా 10 వేలవరకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
  • ఏడాదిలో రెండుసార్లు అర్హులను గుర్తించి…కొత్తగా అర్హులయినవారికి బియ్యం కార్డులు,ఆరోగ్యశ్రీ కార్డులు,ఇళ్ళ పట్టాలు అందిస్తున్నాం
  • ఇలా మరో 44,543 బియ్యం కార్డులు ఇస్తున్నాం.మొత్తం బియ్యం కార్డులు 1,45,88,539 ఉన్నాయి.అలాగే కొత్తగా మరో 14,401 ఆరోగ్యశ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు.మొత్తం ఆరోగ్యశ్రీ కార్డులు 1,41,48,249 కి చేరాయి
  • మరో 14,531 ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం.ఇలా మొత్తం ఇళ్ళ పట్టాలు 30,29,171 ఇచ్చాం
  • గత ప్రభుత్వం దిగిపోయేనాటికి 2019 ఎన్నికలకు రెండు నెలల ముందువరకు పెన్షన్ వెయ్యి రూపాయలిచ్చేవారు.గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఎన్నికలకు 6 నెలలముందువరకు వారిచ్చిన పెన్షన్లు కేవలం 39 లక్షలే…ఈరోజున మన ప్రభుత్వం 64 లక్షల 6 వేల పెన్షన్లు ఇస్తుంది.గత ప్రభుత్వం పెన్షన్లకు చేసిన ఖర్చు నెలకు కేవలం 400 కోట్లే.మనం ఈరోజున నెలకు పెన్షన్ల కోసం 1,765 కోట్లు ఖర్చు చేస్తున్నాం.ఇలా ఏడాదికి పెన్షన్లపై 21,180 కోట్లు ఖర్చు చేస్తున్నాం.ఈ మూడున్నరేళ్ళలో కేవలం పెన్షన్లకోసం 62,500 కోట్లు ఖర్చు చేశాం.గతం లో మాదిరిగా పెన్షన్లలో కోతలు,వివక్ష,లంచాలన్నవి లేవు.గతం లో మాదిరిగా ఎవరికయినా కొత్తగా పెన్షన్ కావాలంటే ఆ ఊరిలో మరొకరెవరయినా మరణించాలనే పద్దతి ఇప్పుడు లేదు.కులాలకు,రాజకీయాలకు,మతాలకు ,వర్గాలకు తావు లేకుండా మా పార్టీకి ఓటు వెయ్యనివారికి కూడా అర్హత ఉంటే చాలు పెన్షన్లు,ఇతర పధకాలను అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నాను
  • మనది మనసున్న ప్రభుత్వం.మనకు చెడు చేసేవారికి సైతం మంచి చేసే గుణం మనది
  • ప్రజలకు సుపరిపాలన అందించడానికే వలంటీర్,సచివాలయ వ్యవస్ధలను తెచ్చాం.నేడు 2,66,000 మంది వలంటీర్లు , 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ప్రజాసేవలో ఉన్నారు.
  • గతం లో మాదిరిగా జన్మభూమి కమిటీలు లేవు,లంచాలు లేవు…అర్హత ఉంటే చాలు అందరికీ పధకాలిస్తున్నాం.జన్మభూమి కమిటీలు గతం లో మీరు ఏ పార్టీకి చెందినవారని అడిగి పధకాలను ఇచ్చేవారు.
  • మంచి చేస్తున్న మన ప్రభుత్వాన్ని…గతం లో ఏనాడూ మంచి చేయని పార్టీలు,నాయకులు నేడు విమర్శిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం
  • రాజకీయ వ్యవస్దను బాబు పూర్తిగా దిగజార్చారు.ఒక ఉదాహరణ చెప్పాలంటే,ఒకడు..తన తల్లిదండ్రులిద్దరినీ తానే చంపేసి..న్యాయమూర్తిముందుకొచ్చి..అయ్యా నేను తల్లి దండ్రి లేనివాడిని నన్ను క్షమించండని కోరాడట..అలా ఉంది చంద్రబాబు పరిస్దితి.తన మామను తానే వెన్నుపోటు పొడుస్తాడు…ఆయన పార్టీని,అధికారాన్నీ లాక్కుంటాడు…మళ్ళీ తానే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఆయన విగ్రహాలకి దండలేసి దండాలు పెడతాడు.హత్యలు చేసి మొసలి కన్నీరు కార్చేది బాబే.ఇలా తన మామనైనా,ప్రజలనయినాసరే బాబుకు తెలిసింది వెన్నుపోటు పొడవడమే.పోటో షూట్లు,డ్రామాలే బాబుకు తెలిసింది.ఈ ఫోటో షూట్ కోసం,డ్రోన్ షాట్ల కోసం బాబు అధికారం లో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలలో ఒక సినిమా దర్శకుని సాయం తో షార్ట్ ఫిల్మ్ ను చిత్రీకరించి 29 మందిని పొట్టనబెట్టుకున్నాడు.ఇంత జరిగినా..ఆరోజున కుంభమేళాలో చనిపోలేదా,ఇతర చోట్ల ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదా ? అని బుకాయించాడు.ఫోటో షూట్ కోసం…మొన్నటికిమొన్న కందుకూరులో జనం తక్కువగా ఉంటే…వారిని ఎక్కువగా చూపాలనే లక్ష్యం తో 8 మందిని బలి తీసుకున్నాడు.నిన్న గుంటూరులో ముగ్గురిని పొట్టనబెట్టుకున్నాడు.బాబు నైజాన్ని దత్తపుతృడు ,ఆంధ్రజ్యోతి,టీవీ 5 చూపించవు,బాబును ప్రశ్నించవు.పేదలను చంపి…వారు టీడీపీ కోసం ప్రాణ త్యాగం చేశారని చెబుతాడు.మరణించినవారి కులాలనుకూడా రాజకీయలబ్దికి వాడుకుంటాడు.కందుకూరులో 8 మందిని చంపిన బాబు..తన రక్త దాహం తీరక…గుంటూరులో ముగ్గురిని పొట్టనబెట్టుకున్నాడు.అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు కురిపించారు.రాజమండ్రి సభలో సీఎం జగన్ ప్రసంగం రాజమండ్రి సభలో సీఎం జగన్ ప్రసంగం రాజమండ్రి సభలో సీఎం జగన్ ప్రసంగం రాజమండ్రి సభలో సీఎం జగన్ ప్రసంగం

Latest Posts

Don't Miss