Latest Posts

యువత రాజకీయంగా ఎదుగుదలకై కృషి చేయాలి-కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

 

గిరిజనులు రాజకీయంగా ఎదగడం కోసం యువత కృషి చేయాలి
జివిఎస్ఎస్ కేలండర్ ను ఆవిష్కరించిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
GVSS గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డుంగావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ధర్మవరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజనులు అభివృద్ధి వైపు పయనించాలని ప్రతి ఒక్క యువత ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్థిరపడాలని గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవిఎస్ఎస్ నాయకులు చంద్రనాయక్, మహేష్ నాయక్, అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss